AUS vs IND: ఐదుగురు ఆసీస్ స్టార్ ఆటగాళ్లను భయపెడుతున్న భారత బ్యాటర్

AUS vs IND: ఐదుగురు ఆసీస్ స్టార్ ఆటగాళ్లను భయపెడుతున్న భారత బ్యాటర్

ఆస్ట్రేలియాపై గతంలో సచిన్ టెండూల్కర్ పీడకల. ఎంతమందిని ఔట్ చేసినా సచిన్ మాత్రం ఆసీస్ పై పరుగుల వరద పారిస్తాడు. ఆ తర్వాత భారత మాజీ క్యాప్టిన్ విరాట్ కోహ్లీ. ఫార్మాట్ ఏదైనా ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ రికార్డ్ అమోఘం. ముఖ్యంగా టెస్టుల్లో కోహ్లీ  అద్భుతమైన రికార్డ్ కలిగి ఉన్నాడు. 2014-15 ఆస్ట్రేలియా టూర్ లో ఏకంగా నాలుగు సెంచరీలు బాదాడు. అయితే ఆస్ట్రేలియా మాత్రం ఒక్క భారత ప్లేయర్ విషయంలో కంగారు పడుతుంది. అతనెవరో కాదు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. 

ప్రస్తుతం రోహిత్ శర్మకు టెస్టుల్లో గడ్డుకాలం నడుస్తుంది. చిన్న జట్లపై తక్కువ స్కోర్ కే పెవిలియన్ కు చేరుతున్నాడు. రోహిత్ విఫలం కావడం భారత ఓటములపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. హిట్ మ్యాన్ పేలవ ఫామ్ లో ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ ఆట తీరును తెగ పొగిడేస్తున్నారు. ఫాక్స్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవ్ స్మిత్, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లియోన్,  ఉస్మాన్ ఖవాజా.. రోహిత్ శర్మను తమ ఆల్ టైం ప్లేయింగ్ 11 లో చోటు కల్పించారు. 

ALSO READ | IND vs NZ: కివీస్‌తో భారత్‌ మూడో టెస్ట్.. 24 ఏళ్ళ తర్వాత ప్రమాదంలో మరో రికార్డ్

మార్నస్ లాబుస్‌చాగ్నే రోహిత్ శర్మను నాన్ స్ట్రైకింగ్ ఎండ్ ఓపెనర్ గా సెలక్ట్ చేశాడు. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి మ్యాచ్‌ను లాసుకుంటాడు అని ఈ ఆసీస్ బ్యాటర్ అన్నాడు. స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. "రోహిత్ చాలా ప్రమాదకర ఆటగాడు. కొత్త బంతిని అద్భుతంగా ఆడగలడు. షాట్స్ ఆడగలడు. అదే విధంగా డిఫెన్స్ ఆడగల సమర్ధుడు. బౌలర్ ను ఒత్తిడిలోకి నెట్టడంలో దిట్ట".  అన్నాడు. 

"రోహిత్ ఎలాంటి షాట్ అయినా ఆడగలడు. ఈజీగా సిక్సర్లు కొట్టగలడు". అని స్పిన్నర్ నాథన్ లియోన్ అన్నాడు. "అలవోకగా పరుగులు చేయగలడు. చాలా నిలకడైన బ్యాటర్" అని ఓపెనర్ ఖవాజా కితాబిచ్చాడు. "రోహిత్ కు బౌలింగ్ వేయడం చాలా కష్టంతో కూడుకున్నది" అని బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ తెలిపాడు. వచ్చే నెలలో భారత జట్టు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. 5 టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది.