ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్వీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. మూడో వన్డేలోనూ విండీస్‌‌‌‌‌‌

కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెరా (ఆస్ట్రేలియా): వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మూడు వన్డేల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆస్ట్రేలియా 3–0తో క్లీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్వీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. జేవియర్ బార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెట్ (4/21) మరోసారి విజృంభించడంతో  మంగళవారం జరిగిన మూడో, చివరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కంగారూ టీమ్ 8 వికెట్ల తేడాతో విండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసింది. టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓడి తొలుత బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన కరీబియన్ టీమ్ 24.1 ఓవర్లలో 86 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది.

ఓపెనర్ అలిక్ అతానజె (32) టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. జేవియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు లాన్స్ మోరిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆడమ్ జంపా చెరో రెండు వికెట్లతో విండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దెబ్బకొట్టారు. అనంతరం ఓపెనర్లు జేక్ ఫ్రేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (41), జోష్ ఇంగ్లిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (35 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) రాణించడంతో ఆసీస్ 6.5 ఓవర్లలోనే 87/2 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. జేవియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డులు లభించాయి.

ALSO READ: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా-కు వైట్ ఫిఫా వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిఫయర్ మ్యాచ్