ఆఖరి లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ రద్దు..సెమీస్‌‌లో ఆస్ట్రేలియా

ఆఖరి లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ రద్దు..సెమీస్‌‌లో ఆస్ట్రేలియా
  • వర్షం వల్ల అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌తో ఆఖరి లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ రద్దు
  • 4 పాయింట్లతో గ్రూప్‌‌‌‌‌‌‌‌-బి టాపర్‌‌‌‌‌‌‌‌గా కంగారూలు
  • రాణించిన ట్రావిస్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌

లాహోర్‌‌‌‌‌‌‌‌:భారీ వర్షం కారణంగా చాంపియన్స్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీలో శుక్రవారం ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌ మధ్య జరిగిన ఆఖరి లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ రద్దయ్యింది. దీంతో గ్రూప్‌‌‌‌‌‌‌‌–బిలో నాలుగు పాయింట్లు సాధించిన కంగారూలు టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌తో సెమీస్‌‌‌‌‌‌‌‌ బెర్త్‌‌‌‌‌‌‌‌ను ఖాయం చేసుకున్నారు. టాస్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌ 50 ఓవర్లలో 273 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. సెదిఖుల్లా అటల్‌‌‌‌‌‌‌‌ (95 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 85), అజ్మతుల్లా ఒమర్‌‌‌‌‌‌‌‌జాయ్‌‌‌‌‌‌‌‌ (63 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌‌‌‌‌, 5 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 67) రాణించారు. 

తర్వాత ఆసీస్‌‌‌‌‌‌‌‌ 12.5 ఓవర్లలో 109/1 స్కోరు చేసింది. ఈ దశలో వాన వల్ల మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు అంతరాయం కలిగింది. మధ్యలో కాస్త తెరిపి ఇచ్చినా ఔట్‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ చిత్తడిగా మారడంతో ఆట సాధ్యం కాలేదు. దీంతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన అంపైర్లు ఇరుజట్లకు చెరో పాయింట్‌‌‌‌‌‌‌‌ కేటాయించారు. ఆసీస్‌‌‌‌‌‌‌‌ ఛేదనలో  ట్రావిస్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌ (59 నాటౌట్‌‌‌‌‌‌‌‌) హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ చేశాడు. తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 44 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి మాథ్యూ షార్ట్‌‌‌‌‌‌‌‌ (20) ఔట్‌‌‌‌‌‌‌‌ కాగా, వన్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌లో  స్టీవ్‌‌‌‌‌‌‌‌ స్మిత్‌‌‌‌‌‌‌‌ (19 నాటౌట్‌‌‌‌‌‌‌‌) ఫర్వాలేదనిపించాడు. 

ఆదుకున్న అటల్‌‌‌‌‌‌‌‌, అజ్మతుల్లా..

ముందుగా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన అఫ్గాన్‌‌‌‌‌‌‌‌కు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఐదో బాల్‌‌‌‌‌‌‌‌కే షాక్‌‌‌‌‌‌‌‌ తగిలింది. స్పెన్సర్‌‌‌‌‌‌‌‌ జాన్సన్‌‌‌‌‌‌‌‌ (2/49) బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో రహ్మనుల్లా గుర్బాజ్‌‌‌‌‌‌‌‌ (0) డకౌటయ్యాడు. 3/1 స్కోరుతో కష్టాల్లో పడిన అఫ్గాన్‌‌‌‌‌‌‌‌ను ఇబ్రహీం జద్రాన్‌‌‌‌‌‌‌‌ (22), అటల్‌‌‌‌‌‌‌‌  గట్టెక్కించారు. తొలి పవర్‌‌‌‌‌‌‌‌ ప్లేలో 54 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను కుదుటపర్చారు. కానీ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ ఆడమ్‌‌‌‌‌‌‌‌ జంపా (2/48) వచ్చీ రావడంతోనే జద్రాన్‌‌‌‌‌‌‌‌ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసి రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 67 రన్స్‌‌‌‌‌‌‌‌ భాగస్వామ్యాన్ని విడదీశాడు. 

ఓ ఎండ్‌‌‌‌‌‌‌‌లో స్థిరంగా ఆడిన అటల్‌‌‌‌‌‌‌‌ మంచి కవర్‌‌‌‌‌‌‌‌డ్రైవ్స్‌‌‌‌‌‌‌‌, ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌తో ఆసీస్‌‌‌‌‌‌‌‌ బౌలర్లపై ఆధిపత్యం చూపెట్టాడు. రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో రహమత్‌‌‌‌‌‌‌‌ షా (12) నిరాశపర్చినా, కెప్టెన్‌‌‌‌‌‌‌‌ హష్మతుల్లా షాహిది (20) ఫర్వాలేదనిపించాడు. మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ (1/28) బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో మిడాన్‌‌‌‌‌‌‌‌లో భారీ సిక్స్‌‌‌‌‌‌‌‌తో అటల్‌‌‌‌‌‌‌‌ 64 బాల్స్‌‌‌‌‌‌‌‌లో హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత జంపాను లక్ష్యంగా చేసుకుని మరో రెండు భారీ సిక్సర్లు బాదాడు.

 సెంచరీ దిశగా సాగుతున్న అటల్‌‌‌‌‌‌‌‌ను 32వ ఓవర్‌‌‌‌‌‌‌‌ జాన్సన్‌‌‌‌‌‌‌‌ పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు పంపడంతో నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌కు 68 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ముగిసింది. 159/4 స్కోరు ఉన్న దశలో క్రీజులోకి వచ్చిన అజ్మతుల్లా మెరుపు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఆడాడు. నేథన్‌‌‌‌‌‌‌‌ ఎల్లిస్‌‌‌‌‌‌‌‌ (1/60) బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో రెండు భారీ సిక్సర్లతో కలిపి మొత్తం ఐదుసార్లు బాల్‌‌‌‌‌‌‌‌ను ఫెన్సింగ్‌‌‌‌‌‌‌‌ దాటించాడు. కానీ రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో హష్మతుల్లా, మహ్మద్‌‌‌‌‌‌‌‌ నబీ (1), గుల్బాదిన్‌‌‌‌‌‌‌‌ నైబ్‌‌‌‌‌‌‌‌ (4) ఔట్​ కావడంతో స్కోరు 199/7గా మారింది. 

48వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో డ్వార్షుయిస్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో సింగిల్‌‌‌‌‌‌‌‌తో అజ్మతుల్లా 54 బాల్స్‌‌‌‌‌‌‌‌లో ఫిఫ్టీ అందుకున్నాడు. రషీద్‌‌‌‌‌‌‌‌ (19)తో ఎనిమిదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 36, నూర్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌ (6)తో తొమ్మిదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 37 రన్స్‌‌‌‌‌‌‌‌ జత చేయడంతో అఫ్గాన్‌‌‌‌‌‌‌‌ మంచి టార్గెట్‌‌‌‌‌‌‌‌ను నిర్దేశించింది. 

సంక్షిప్త స్కోర్లు

అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌: 50 ఓవర్లలో 273 ఆలౌట్‌‌‌‌‌‌‌‌ (సెదిఖుల్లా అటల్‌‌‌‌‌‌‌‌ 85, అజ్మతుల్లా ఒమర్‌‌‌‌‌‌‌‌జాయ్‌‌‌‌‌‌‌‌ 67, డ్వార్షుయిస్‌‌‌‌‌‌‌‌ 3/47), ఆస్ట్రేలియా: 12.5 ఓవర్లలో 109/1 (హెడ్‌‌‌‌‌‌‌‌ 59*, స్మిత్‌‌‌‌‌‌‌‌ 19*, అజ్మతుల్లా 1/43).

207 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో ఓడితేనే..

ఆసీస్‌‌‌‌‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ రద్దయినా.. మూడు పాయింట్లతో ఉన్న అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌ సాంకేతికంగా నాకౌట్‌‌‌‌‌‌‌‌ రేసులోనే ఉంది. అయితే అఫ్గాన్‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌‌‌‌‌ రన్‌‌‌‌‌‌‌‌రేట్‌‌‌‌‌‌‌‌ -0.99గా ఉండటంతో సెమీస్‌‌‌‌‌‌‌‌ ఆశలన్నీ సౌతాఫ్రికా (3), ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ (0) మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఫలితంపై ఆధారపడి ఉన్నాయి. 

ఒకవేళ అఫ్గాన్‌‌‌‌‌‌‌‌ రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌కు రావాలంటే సౌతాఫ్రికా కనీసం 207 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ చేతిలో ఓడాలి. ఇక ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో సఫారీలు సాధారణంగా గెలిచినా గ్రూప్‌‌‌‌‌‌‌‌–బిలో టేబుల్‌‌‌‌‌‌‌‌ టాపర్‌‌‌‌‌‌‌‌ నిలుస్తారు. అప్పుడు ఆసీస్‌‌‌‌‌‌‌‌ రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉంటుంది. కాబట్టి ఎలా చూసినా అఫ్గాన్‌‌‌‌‌‌‌‌ సెమీస్‌‌‌‌‌‌‌‌ చేరడం దాదాపుగా కష్టమే.

చాంపియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీలో నేటి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
సౌతాఫ్రికా X ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌
మ. 2.30 నుంచి

మరిన్ని వార్తలు