Cricket World Cup 2023: దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య సెమీ ఫైనల్ ఫిక్స్.. భారత్‌తో ఆడేది ఎవరు?

Cricket World Cup 2023: దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య సెమీ ఫైనల్ ఫిక్స్.. భారత్‌తో ఆడేది ఎవరు?

వరల్డ్ కప్ లో మరో నాలుగు రోజుల్లో లీగ్ మ్యాచ్ లు ముగుస్తాయి. భారత్, దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగా.. ఆస్ట్రేలియా నిన్న ఆఫ్ఘనిస్తాన్ పై  సంచలన విజయంతో సెమీస్ లోకి ప్రవేశించింది. మరోవైపు ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక ఇప్పటికే ఇంటి దారి పట్టగా.. మిగిలి ఉన్న ఒక్క స్థానం కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్ , ఆఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్ పోటీ పడనున్నాయి.   
                
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య సెమీస్ 

వరల్డ్ కప్ లో నవంబర్ 16 న రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. భారత్ తమ చివరి మ్యాచ్ లో ఓడిపోయిన టాప్ లోనే ఉంటుంది. మరో వైపు ఆసీస్, దక్షిణాఫ్రికా తమ చివరి మ్యాచ్ లో గెలిచినా, ఓడిపోయినా రెండు మూడు స్థానాల్లోనే ఉంటాయి. షెడ్యూల్ ప్రకారం మొదటి స్థానంలో నిలిచిన జట్టుతో నాలుగో స్థానంలో నిలిచిన జట్టుతో నవంబర్ 15 న మొదటి సెమీ ఫైనల్ ఆడుతుంది. అదే విధంగా రెండు మూడు స్థానాల్లో నిలిచిన జట్లు నవంబర్ 16 న రెండో సెమీ ఫైనల్ ఆడతాయి. 

ఆ రెండు జట్లకు భారత్ తో ఆడే ఛాన్స్ 

ఇక భారత్ టాప్ లో ఉంది కాబట్టి నాలుగో స్థానం కోసం ఇప్పుడు నాలుగు జట్లు రేస్ లో ఉన్నాయి. వీటిలో నెదర్లాండ్స్ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. 7 మ్యాచ్ ల్లో రెండు గెలిచిన నెదర్లాండ్స్.. మిగిలిన రెండు మ్యాచ్ ల్లో భారీ తేడాతో గెలవడంతో పాటు   న్యూజిలాండ్, పాకిస్థాన్ , ఆఫ్ఘనిస్థాన్ తమ చివరి మ్యాచ్ ల్లో భారీ తేడాతో ఓడిపోవాలి. ఇక పాకిస్థాన్, కివీస్, ఆఫ్ఘనిస్తాన్ తమ చివరి మ్యాచ్ లో గెలిచి రన్ రేట్ మెరుగ్గా ఉంటే సెమీ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లలో ఒక జట్టు భారత్ తో సెమీ ఫైనల్ ఆడే అవకాశం ఉంది.