AUS vs IND: నిరాశ పరిచిన టీమిండియా.. తొలి రోజు పటిష్ట స్థితిలో ఆసీస్

AUS vs IND: నిరాశ పరిచిన టీమిండియా.. తొలి రోజు పటిష్ట స్థితిలో ఆసీస్

అడిలైడ్ టెస్టులో తొలి రోజే భారత ఆటగాళ్లు వెనక పడ్డారు. మొదట బ్యాటింగ్.. ఆ  తర్వాత బౌలింగ్ లో పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగా ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి రోజు ఆట ముగిసేసమయానికి తొలి ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. క్రీజ్ లో మార్నస్ లాబుషాగ్నే(20), నాథన్ మెక్‌స్వీనీ(38) ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 94 పరుగులు వెనకబడి ఉంది. చేతిలో మరో 9 వికెట్లు ఉన్నాయి. 

భారత్ ను తక్కువ స్కోర్ కే పరిమితం చేసి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో కూడా పట్టుదల చూపించింది. ఓపెనర్ ఖవాజా 13 పరుగులే చేసి ఔటైనా యువ ఓపెనర్ మెక్‌స్వీనీ, లాబుషాగ్నే ఆసీస్ ను ఆదుకున్నారు. పరుగులు చేయడం పక్కన పెడితే వీరు క్రీజ్ లో కుదురుకునేందుకు ఎక్కువ సమయం తీసుకున్నారు. ముఖ్యంగా ఓ ఎండ్ లో లాబుషాగ్నే క్రీజ్ లో పాతుకుపోయాడు. దీంతో భారత బౌలర్లు అలసిపోయారు. ఇదే అవకాశంగా తీసుకున్న ఆసీస్ క్రమంగా పరుగులు రాబట్టింది. 

Also Read:-ఆటగాళ్లను దాగుడుమూతలు ఆడించిన ఫ్లడ్‌లైట్లు.. 

అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ చెలరేగడంతో పాటు మిగిలిన బౌలర్లు రాణించడంతో 180 పరుగులకే ఆలౌట్ అయింది. 42 పరుగులు చేసిన నితీష్ రెడ్డి భారత్ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. జైశ్వాల్ (0), కోహ్లీ (7), రోహిత్ శర్మ (3) విఫలమయ్యారు. రాహుల్ 39 పరుగులు చేసి పర్వాలేదనిపించగా.. గిల్ 31 పరుగులతో రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ ఆరు వికెట్లు తీసుకున్నాడు. బోలాండ్ 3 వికెట్లు.. కమ్మిన్స్ కు రెండు వికెట్లు లభించాయి.