IND vs AUS 3rd Test: ఫలించని ఆస్ట్రేలియా ప్రయోగం.. 'డ్రా' గా ముగిసిన గబ్బా టెస్ట్

IND vs AUS 3rd Test: ఫలించని ఆస్ట్రేలియా ప్రయోగం.. 'డ్రా' గా ముగిసిన గబ్బా టెస్ట్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్ట్ డ్రా అయింది. బ్రిస్బేన్ వేదికగా గబ్బాలో ముగిసిన ఈ టెస్టులో ఐదో రోజు వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్ ను డ్రా గా ప్రకటిస్తున్నట్టు తెలిపారు. 275 పరుగుల లక్ష్యంతో చివరి రోజు బ్యాటింగ్ కు దిగిన భారత్ కేవలం 2.1 ఓవర్లు మాత్రమే ఆడింది. ఈ దశలో వర్షం రావడంతో అంపైర్లు టీ విరామం ఇచ్చారు. టీ బ్రేక్ తర్వాత వర్షం తగ్గకపోవడంతో ఇరు జట్లు డ్రా కు అంగీకరించారు. 

మ్యాచ్ డ్రా కావడంతో ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా జట్లు ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 1-1 తో సమంగా నిలిచాయి. తొలి టెస్ట్ భారత్ గెలవగా.. రెండో టెస్ట్ ఆస్ట్రేలియా విజయం సాధించింది. మరో రెండు టెస్టులు ఈ సిరీస్ లో జరగాల్సి ఉంది. సిరీస్ లోని నాలుగో టెస్ట్ డిసెంబర్ 26 న మెల్ బోర్న్ వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి రోజు ఆస్ట్రేలియా బ్యాటర్లు ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101) సెంచరీలు చేసి ఆస్ట్రేలియా భారీ స్కోర్ అందించారు.  భారత బౌలర్లలో బుమ్రా ఆరు వికెట్లు తీసుకున్నాడు. 

Also Read :- విలియంసన్ స్థానంలో న్యూజిలాండ్ జట్టుకు కొత్త కెప్టెన్

అనంతరం తొలి ఇన్నింగ్స్ లో భారత్ 260 పరుగులకు ఆలౌట్ అయింది. జడేజా(77), రాహుల్(84) హాఫ్ సెంచరీలతో రాణించారు.  రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 274 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఆసీస్ భారత్ ముందు 275 పరుగుల లక్ష్యాన్ని విధించింది. 275 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 2.1 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 8 పరుగులు చేసింది.