మెల్‌‌‌‌బోర్న్ మొనగాడు.. అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్న నితీశ్‌‌‌‌‌‌ రెడ్డి

మెల్‌‌‌‌బోర్న్ మొనగాడు.. అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్న నితీశ్‌‌‌‌‌‌ రెడ్డి
  • సత్తా చాటిన వాషింగ్టన్ సుందర్
  • ఇండియా 358/9.. ఇంకా 116 రన్స్‌‌‌‌ వెనుకంజే

మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌: ఆస్ట్రేలియా గడ్డపై  నితీశ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి (176 బాల్స్‌‌‌‌లో 10 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 105 బ్యాటింగ్‌‌‌‌) తెలుగోడి తెగువ చూపెట్టాడు. ప్రఖ్యాత మెల్‌‌‌‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌‌‌‌లో అత్యద్భుత సెంచరీతో నాలుగో టెస్టులో టీమిండియాను ఆదుకున్నాడు. పేరున్న ప్లేయర్లంతా కాడి వదిలేసిన వేళ తెలుగు కుర్రాడు జట్టుకు ఆపద్భాంధవుడయ్యాడు. వాషింగ్టన్ సుందర్ (162 బాల్స్‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌‌‌‌‌తో 50)తో కలిసి ఎనిమిదో వికెట్‌‌‌‌కు 127 రన్స్ జోడించిన నితీశ్‌‌‌‌ ఫాలోఆన్‌‌‌‌ తప్పించి జట్టును పోటీలోకి తెచ్చాడు. ఈ ఇద్దరి అసమాన ఆటతో మూడో రోజు, శనివారం ఆట చివరకు తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో ఇండియా 358/9 స్కోరుతో నిలిచింది. బోలాండ్‌‌‌‌, కమిన్స్ చెరో మూడు, లైయన్ రెండు వికెట్లు పడగొట్టారు.

నితీశ్‌‌‌‌కు తోడు హైదరాబాదీ సిరాజ్ (2 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉండగా.. ఆసీస్‌‌‌‌ స్కోరుకు ఇండియా ఇంకా 116 రన్స్ వెనుకంజలోనే నిలిచింది. మన జట్టుకు  ముప్పు పూర్తిగా తప్పలేదు. అయితే, ఎంసీజీ పిచ్ నుంచి బౌలర్లకు పెద్దగా సహకారం లభించడం లేదు. నితీశ్‌‌‌‌ ఇప్పటికే దారి చూపించిన నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో మిగతా బ్యాటర్లూ బాధ్యత తీసుకుంటే మ్యాచ్‌‌‌‌ను కాపాడుకోవడం పెద్ద పని కాకపోవచ్చు.

జోడీ కుదిరింది
మూడో రోజు ఆటలో నితీశ్ రెడ్డి అన్నీ తానై జట్టును ముందుకు తీసుకొచ్చాడు. ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 164/5తో జట్టు ఆట కొనసాగించగా రిషబ్ పంత్ (28) ఆరంభంలో కొన్ని బౌండ్రీలతో అలరించారు. కానీ, బోలాండ్ బౌలింగ్‌‌‌‌లో చెత్త షాట్‌‌‌‌కు ట్రై చేసి ఔటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన నితీశ్‌‌‌‌ ఆరంభం నుంచే ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. లైయన్ బౌలింగ్‌‌‌‌లో ఆఫ్ డ్రైవ్‌‌‌‌తో పాటు, లాఫ్ట్‌‌‌‌ షాట్‌‌‌‌తో సిక్స్‌‌‌‌ కొట్టాడు. కానీ, మరో ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ బ్యాటర్ జడేజా (17)ను లైయన్‌‌‌‌  ఎల్బీ చేయడంతో ఇండియా తొలి సెషన్‌‌లోనే ఆలౌటయ్యేలా కనిపించింది. అయితే, తొమ్మిదో నంబర్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన సుందర్‌‌‌‌‌‌‌‌ తోడుగా నితీశ్‌‌‌‌ జట్టును గట్టెక్కించే బాధ్యతను తీసుకున్నాడు.  మరో ఎండ్‌‌‌‌లో సుందర్ అద్భుతమైన డిఫెన్స్‌‌‌‌ చూపెట్టాడు.

సింగిల్స్‌‌‌‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ నితీశ్‌‌‌‌కు గొప్ప సహకారం అందించాడు. 244/4 స్కోరుతో లంచ్‌‌‌‌కు వెళ్లొచ్చిన తర్వాత నితీశ్​ ఫిఫ్టీ (81 బాల్స్‌‌‌‌లో) పూర్తి చేసుకున్నాడు. బ్రేక్ తర్వాత కొత్త బాల్‌‌‌‌ను కూడా మెరుగ్గా ఎదుర్కొన్నాడు. ఆసీస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ బౌలర్లను, ఫీల్డింగ్‌‌‌‌ను మార్చినా ఈ జోడీని విడదీయలేకపోయాడు. మధ్యలో వర్షంతో కొద్దిసేపు ఆట ఆగింది. టీ బ్రేక్ తర్వాత తిరిగి మొదలైన తర్వాత కూడా నితీశ్‌‌‌‌, సుందర్‌‌‌‌‌‌‌‌ ఏకాగ్రతను కోల్పోలేదు. తన ఇన్నింగ్స్‌‌‌‌లో ఒకే ఒక్క బౌండ్రీ కొట్టిన సుందర్‌‌‌‌‌‌‌‌  146 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. చివరకు లైయన్ లెంగ్త్ బాల్‌‌‌‌ను అర్థం చేసుకోలేక స్లిప్‌‌‌‌లో స్మిత్‌‌‌‌కు క్యాచ్ ఇవ్వడంతో  ఆసీస్‌‌‌‌కు ఎట్టకేలకు బ్రేక్ లభించింది.

నాన్న దిద్దిన ఆణి ముత్యం
 దేశంలో చాలా మంది చిన్నారులు పెద్ద క్రికెటర్లు కావాలని కలలు కంటారు. వారి  కలను నెరవేర్చేందుకు తల్లిదండ్రులు ఎంతో శ్రమిస్తారు.. తమ బిడ్డ దేశానికి ఆడాలని తపిస్తారు. ఎన్ని కష్టాలు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొంటారు. కానీ, కోట్లలో కొందరు మాత్రమే విజయం సాధిస్తారు. అయితే, ఆ విజయం ఎంత మధురంగా ఉంటుందో మెల్‌‌‌‌బోర్న్ క్రికెట్‌‌‌‌ స్టేడియంలో నితీశ్‌‌‌‌ రెడ్డి, అతని తండ్రి ముత్యాలు రెడ్డి చూపించారు. నితీశ్‌‌‌‌ సెంచరీ చేయగానే స్టేడియంలో ముత్యాల రెడ్డి భావోద్వేగం.. టీవీల ముందు కూర్చున్న వారిని కూడా కంట తడి పెట్టించింది. మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌లో ఇండియా ఆటలో నితీశ్‌‌‌‌ హీరో అయితే.. ఎన్నో కష్టాలు ఎదుర్కొని.. మరెన్నో త్యాగాలు చేస్తూ అతడిని ఈ స్థాయికి తెచ్చిన ముత్యాలు కూడా హీరోనే.

వైజాగ్‌‌‌‌లో పుట్టిన నితీశ్‌‌‌‌ రెడ్డిది మిడిల్‌‌‌‌క్లాస్‌‌‌‌ ఫ్యామిలీ. ముత్యాల రెడ్డి హిందుస్తాన్‌‌‌‌  జింక్ అనే కంపెనీలో చిరుద్యోగి. చిన్నప్పుడే నితీశ్‌‌‌‌లో క్రికెట్ టాలెంట్‌‌‌‌ ఉందని తెలుసుకొని అతడిని తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు అడ్డొస్తున్నదని 25 ఏండ్ల సర్వీస్‌‌‌‌ ఉండగానే ఉద్యోగానికి వీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఇచ్చేశాడు.. నితీశ్‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌గా ఎదగడానికి అవసరమైనవన్నీ సమకూర్చాడు.

అప్పుల బాధలో కూరుకుపోయినా.. బంధువులు నుంచి అవమానాలు ఎదురైనా.. ఆ బాధలన్నీ పంటి బిగువున భరిస్తూ అన్నీ తానై అనుక్షణం నితీశ్‌‌‌‌ వెంట ఉన్నాడు. తన కోసం తండ్రి చేస్తున్న త్యాగాలను 12 ఏండ్ల ప్రాయంలోనే అర్థం చేసుకున్న నితీశ్‌‌‌‌ ఎలాగైనా పెద్ద క్రికెటర్ అవ్వాలని.. ఆటతోనే నాన్న కష్టాలను తీర్చాలని నిర్ణయించుకున్నాడు. అంతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌‌‌‌ (ఏసీఏ) అండర్‌‌‌‌‌‌‌‌-14 విభాగం ఆడిన ప్రతీ టోర్నీలోనూ పరుగుల మోత మోగించాడు. ఆరంభంలో టాపార్డర్ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ అయిన నితీశ్‌‌‌‌ ఒక్క బ్యాటింగ్‌‌‌‌తోనే తాను ఇండియా టీమ్‌‌‌‌లోకి రాలేనని అదనంగా పేస్ బౌలింగ్‌‌‌‌ కూడా నేర్చుకున్నాడు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ ముందుకొచ్చిన అతను ముందుగా ఐపీఎల్‌‌‌‌లో చోటు దక్కించుకొని తనలోని ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ను దేశానికి చూపెట్టాడు.

బంగ్లాదేశ్‌‌‌‌తో టీ20 సిరీస్‌‌‌‌లో తన బ్యాట్ పవర్‌‌‌‌‌‌‌‌ చూపెట్టిన నితీశ్‌‌‌‌ ఈ సిరీస్‌‌‌‌ తొలి రెండు మ్యాచ్‌‌‌‌ల్లో నాలుగు ఇన్నింగ్స్‌‌‌‌ల్లో మూడుసార్లు ఇండియా టాప్ స్కోరర్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. ఇప్పుడు మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌ సెంచరీతో తన స్థాయి ఇదీ అని నిరూపించాడు. ఈ మ్యాచ్‌‌‌‌లో అతని ఆట అద్భుతం. అప్పటికే ఏడు వికెట్లు పడినా.. అతను చూపెట్టిన తెగువ.. ఆత్మవిశ్వాసంతో కొట్టిన షాట్లు.. ఒక్కో పరుగు జోడిస్తూ.. జట్టును ముందుకు తీసుకొచ్చిన విధానం ఓ మాస్టర్‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌. పాత బంతితోపాటు కొత్త బాల్‌‌‌‌తోనూ వరల్డ్ బెస్ట్ పేసర్లను ధైర్యంగా ఎదుర్కొన్న నితీశ్‌‌‌‌.. తనకు ఏ పని అప్పగించినా చేస్తానని నిరూపించాడు. తండ్రి ముత్యాల రెడ్డి తీర్చిదిద్దిన నితీశ్‌‌‌‌ ఈ టూర్‌‌‌‌‌‌‌‌లో టీమిండియాకు దొరికిన ఆణిముత్యం.

(వెలుగు స్పోర్ట్స్‌ డెస్క్)

రూ. 25 లక్షల నజరానామెల్‌‌‌‌బోర్న్ టెస్టులోసెంచరీతో మెరిసిన నితీశ్‌‌‌‌కు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌‌‌‌  రూ. 25 లక్షల నజరానా ప్రకటించింది.

2 ఎనిమిదో వికెట్‌‌‌‌కు నితీశ్‌‌‌‌, సుందర్ జోడించిన 127 రన్స్ భాగస్వామ్యం ఆస్ట్రేలియాలో ఇండియాకు రెండో అత్యుత్తమం. 2008 సిడ్నీ టెస్టులో సచిన్‌‌‌‌–హర్భజన్‌‌‌‌ 129 రన్స్ భాగస్వామ్యం నమోదు చేశారు.

సెంచరీ ముందు టెన్షన్ టెన్షన్‌‌‌‌.. 
సుందర్ ఔటయ్యే టైమ్‌‌‌‌కు నితీశ్‌‌‌‌ 97 రన్స్ వద్ద  ఉన్నాడు. బోలాండ్ బౌలింగ్‌‌‌‌లో డబుల్ తీసి 99కు వచ్చాడు. తర్వాతి ఓవర్లోనే బుమ్రా (0)ను కమిన్స్‌‌‌‌ ఔట్‌‌‌‌ చేయడంతో నితీష్‌‌‌‌ సెంచరీ చేస్తాడో లేదో అని స్టేడియంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరి బ్యాటర్‌‌‌‌‌‌‌‌గా వచ్చిన సిరాజ్ కమిన్స్‌‌‌‌ మూడు బాల్స్‌‌‌‌ను డిఫెండ్ చేయడంతో నితీశ్‌‌‌‌ స్ట్రయిక్‌‌‌‌లోకి వచ్చాడు. బోలాండ్ బౌలింగ్‌‌‌‌లో  ఫోర్ కొట్టి సెంచరీ అందుకు న్నాడు. అంతే స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు ఇండి యా ఆటగాళ్లంతా ఆనందంలో మునిగిపో యారు.  ఫిఫ్టీని పుష్ప స్టయిల్‌‌‌‌లో సెలబ్రేట్ చేసుకున్న నితీశ్‌‌‌‌.. సెంచరీ తర్వాత మోకాళ్లపై కూర్చొని బ్యాట్‌‌‌‌పై హెల్మెట్‌‌‌‌ నుంచి ఓ చేతిని పైకి చూపిస్తూ ‘బాహుబలి‌‌‌‌’ స్టయిల్లో సంబరాలు చేసుకున్నాడు. 

2 ఎనిమిదో నంబర్‌‌‌‌‌‌‌‌లో వచ్చి టెస్టు సెంచరీ చేసిన రెండో ఇండియన్ నితీశ్‌‌‌‌. వృద్ధిమాన్ సాహా 2017లో తొలిసారి ఈ ఘనత సాధించాడు.

3  ఆస్ట్రేలియాలో సెంచరీ చేసిన మూడో యంగెస్ట్ ఇండియన్ నితీశ్ (21 ఏండ్ల 214 రోజులు), సచిన్‌‌‌‌ (18 ఏండ్లు), 
పంత్ (21 ఏండ్ల 91 రోజులు) ముందున్నారు.

సంక్షిప్త స్కోర్లు

  • ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌:  474  ఆలౌట్‌‌‌‌
  • ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌: 116 ఓవర్లలో 358/9 ( నితీశ్‌‌‌‌ రెడ్డి 105 బ్యాటింగ్‌‌‌‌, సుందర్ 50,  బోలాండ్‌‌‌‌ 3/57, కమిన్స్‌‌‌‌ 3/86).