Champions Trophy 2025: సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు.. ఇరు జట్లకు చెరో పాయింట్

Champions Trophy 2025: సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు.. ఇరు జట్లకు చెరో పాయింట్

ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ బి లో భాగంగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ రద్దయింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే తుడుచుపెట్టుకొని పోయింది. రావల్పిండి వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ లో కనీసం టాస్ కూడా వేయలేదు. టాస్ ముందు ప్రారంభమైన వర్షం సాయంత్రం 5 గంటలవరకు తగ్గలేదు. దీంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యం కాకపోవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. రెండు జట్లు కూడా తమ చివరి మ్యాచ్ లో గెలిస్తేనే సెమీస్ కు చేరుతాయి.

ప్రస్తుతం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా 3 పాయింట్లతో సమంగా ఉన్నాయి. నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో సౌతాఫ్రికా టాప్ లో ఉంది. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్ లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ పై రికార్డ్ విజయం సాధించగా.. సౌతాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ పై భారీ తేడాతో గెలిచింది. ఇదే గ్రూప్ లో ఉన్న ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటివరకు సెమీస్ కు చేరలేదు. మిగిలిన రెండు మ్యాచ్ ల్లోనూ గెలిస్తేనే ఈ రెండు జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయి. గ్రూప్ ఏ లో ఇప్పటికే ఇండియా, న్యూజిలాండ్ సెమీస్ కు చేరుకున్నాయి.