Crickek World Cup 2023 : ప్రపంచ ఛాంపియన్లకు ఏంటి ఈ దుస్థితి? సెమీస్ చేరాలంటే ఎన్ని మ్యాచులు గెలవాలి

Crickek World Cup 2023 : ప్రపంచ ఛాంపియన్లకు ఏంటి ఈ దుస్థితి? సెమీస్ చేరాలంటే ఎన్ని మ్యాచులు గెలవాలి

ఐసీసీ క్రికెట్ వరల్డ్  కప్ లో ఆస్ట్రేలియా జట్టు పరిస్థితి అద్వానంగా తయారైంది. వరల్డ్ కప్ అంటే పూనకం వచ్చేట్టు ఆడే కంగారులకి ఇంత చెత్త ప్రారంభం వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ఈ మెగా టోర్నీకి ముందు టైటిల్ ఫేవరేట్ గా దిగిన ఆసీస్.. వరుస ఓటములతో ఏకంగా పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు శ్రీలంకతో తలపడనున్న మ్యాచు ఆసీస్ కి చాలా కీలకంగా మారింది. 

1996 నుంచి చూసుకుంటే వన్డే వరల్డ్ కప్ లో ఆసీస్ ఖచ్చితంగా నాకౌట్ కి వస్తుంది. కానీ ఇప్పుడు వారి పరిస్థితి చూస్తుంటే సెమి ఫైనల్ కి చేరడం కష్టంగానే కనిపిస్తుంది. ఆడిన రెండు మ్యాచుల్లో  భారీ పరాజయాలను మూటకట్టుకుంది. భారత్, దక్షిణాఫ్రికాపై ఆడిన మ్యాచుల్లో కనీసం 200 పరుగులు చేయడంలో విఫలమైంది. బౌలింగ్ అత్యంత దారుణంగా ఉండగా.. బ్యాటింగ్ ఆర్డర్ గందర గోళంగా మారింది. జట్టులో ఏ ఒక్కరు కూడా  బాధ్యతగా పరుగులు చేయకపోగా.. అనవరస షాట్స్ ఆడుతూ వికెట్లు సమర్పించుకుంటున్నారు.
 
ఇదిలా ఉండగా.. నేడు వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా శ్రీలంకను ఢీ కొనబోతుంది. టోర్నీలో ఆసీస్ కి ఇంకా 7 మ్యాచులన్నా నేడు జరగబోయే మ్యాచ్ ఒకరకంగా చావో రేవో లాంటిది. ఎందుకంటే ఓ వైపు భారత్, సౌత్ ఆఫ్రికా, న్యూజీలాండ్ జట్లు వరుస విజయాలతో సెమీస్  రేస్ లో దూసుకెళ్తున్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడితే ఆసీస్ వరుసగా 6 మ్యాచుల్లో భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. మరో వైపు  శ్రీలంక జట్టుకు కూడా నేడు జరగనున్న మ్యాచు చావో రేవోలాంటిది. మరి ఆస్ట్రేలియా నేడు బోణీ కొట్టి కంబ్యాక్ ఇస్తుందో లేకపోతే ఒత్తిడిలో చిత్తవుతుందో చూడాలి.