ప్రస్తుతం ప్రపంచంలో సోషల్మీడియా రాజ్యం ఏలుతుంది. ఏ చిన్న సంఘటన జరిగినా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. చాలామంది దీని ద్వారా డబ్బులు కూడా సంపాదిస్తున్నారనుకోండి అది వేరే విషయం. ఇప్పుడు ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ కేవలం మూడు రోజుల్లోయ60 పెళ్లిళ్లు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
సాధారణంగా పెళ్లి చేయాలంటే చాలా హడావిడి.. ఎంత డబ్బులున్నా..కనీసం నెల రోజుల నుంచే ప్లాన్ వేసుకోవాలి. ఫంక్షన్ హాల్.. పెళ్లి చేయించేందుకు అయ్యగారు, వంట మనిషి, భాజాబజంత్రీలు.. ఫొటో గ్రాఫర్, వీడియో గ్రాఫర్.. పెళ్లిలో ఏఏ వంటకాలు పెట్టాలి.. ఇలా ఒకటేమిటి వెడ్డింగ్ కార్డ్ దగ్గరనుంచి పెళ్లి అయినతరువాత జరగాల్సిన కార్యక్రమాలు పూర్తయ్యేంత వరకు అటు ఆడపెళ్లివారు... ఇటు మగపెళ్లివారు నానా హంగామా.. నానా రచ్చ చేస్తారు. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాకు చెందిన కార్లీ అనే మహిళ కేవలం మూడు రోజుల్లోనే 60 మందిని పెళ్లాడి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కార్లీ సారి అనే 40 ఏళ్ల మహిళ వృత్తి రీత్యా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్.ఆవిడ మూడు రోజుల వివాహ వేడుకలలో మొత్తం 60 మందిని వివాహం చేసుకుంది. అదేంటి ఒక మహిళ మూడు రోజుల్లో ఇంతమందిని పెళ్లి ఎందుకు చేసుకుంది.? అన్న ప్రశ్న వచ్చి ఉండొచ్చు.అందుకు సంబంధించిన విశేషాలను ఓసారి చూస్తే...
వృత్తిరీత్యా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అయిన ఆమె తన మూడు రోజుల వివాహ వేడుకలో మొత్తం 60 మందిని పెళ్లాడింది. 60 ఏళ్ల కార్లీ సారీ పెళ్లి చేసుకున్న వారిలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉన్నారు. ఒకరిని మాత్రమే జీవిత భాగస్వామిగా ఎంచుకోకుండా ఏకంగా 60 మందిని ఎంచుకుని పెళ్లి చేసుకోవడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.
తాను ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్( Wedding Photographer ) కాబట్టి తన జీవితాన్ని వివాహాల వద్ద గడుపుతాను.ఆచారాలకు ప్రతీకమైన సంస్కృతిలో వివాహాలు పుష్పలంగా ఉండే ప్రదేశం అని నేను గమనించినట్లు ఆవిడ తెలిపింది.జీవితకాల సమయం స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య కలిసి జరుపుకోవడానికి ప్రయత్నించే కొన్ని సందర్భాలలో వివాహాలు ఒకటి అంటూ ఆవిడ తెలిపింది.ఈ ఉత్సవాల్లో పోస్టులు, ప్రసంగాలు, ప్రమాణాలు, లాంగ్ టేబుల్ డిన్నర్, వేడుక, నృత్యం, అధికారిక ఫోటోలు లాంటి సాంప్రదాయ వివాహ ఆచారాలు అన్ని ఉన్నాయని ఆవిడ తెలిపింది.
అయితే కార్లీ సారి( Carly Sare ) కేవలం పురుషులతో మాత్రమే కాకుండా మహిళలను కూడా వివాహం చేసుకుంది. జీవిత భాగస్వామిని( Life Partner ) కేవలం ఒక్కరిని మాత్రమే కాకుండా.ఇప్పుడు ఇంతమందిని ఎంచుకోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.ఈ విషయంపై ఆ మహిళ మాట్లాడుతూ.నా నిర్ణయం పట్ల నేను గర్విస్తున్నానని. వాళ్లంతా నా జీవితంలో చాలా కీలకం కనుక తాను వాళ్ళందరినీ కలిపి పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు.ప్రస్తుతం ఈ పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఒకరితో మాత్రమే పెళ్లి చేసుకోవడం అనే కాన్సెప్ట్ నాకు సరిపోదని.తన జీవితం అంతా ఒక వ్యక్తికి అంకితం చేయడం తనకి ఇష్టం లేదని....అందుకే నా స్నేహితులందరితో తాను వివాహం చేసుకున్నానని తెలిపింది.ఇందులో కేవలం పురుషులతో మాత్రమే కాకుండా మహిళలని కూడా తాను వివాహం చేసుకున్నట్లు తెలిపింది.