ఆస్ట్రేలియాపై గబ్బాలో రెండో టెస్టు గెలిచి చరిత్ర సృష్టించిన వెస్టిండీస్.. వన్డే సిరీస్ లో మాత్రం తేలిపోయింది. ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో ఓడిపోయి సిరీస్ చేజార్చుకున్న విండీస్ జట్టు.. మూడో వన్డేలో అత్యంత దారుణంగా ఆడింది. కేవలం 86 పరుగులకే ఆలౌటై ఘోర ఓటమిని మూట కట్టుకుంది. కాన్ బెర్రాలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కంగారూల జట్టు టార్గెట్ ను కేవలం 6.5 ఓవర్లలో రెండు కోల్పోయి ఛేజ్ చేయడం విశేషం.
మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 2 వికెట్లను 43 పరుగులు చేసి పర్వాలేదనిపించింది. అయితే విండీస్ తమ చివరి 8 వికెట్లను 43 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. ఓపెనర్ అతనాజ్ 32 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. జట్టులో ఏకంగా 8 మంది సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. సిరీస్ మొత్తం అద్భుతంగా బౌలింగ్ చేసిన ఆసీస్ పేస్ బౌలర్ బార్ట్ లెట్ చివరి వన్డేల్లో 21 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. లాన్స్ మోరీస్, జంపాలకు తలో రెండు వికెట్లు లభించాయి.
87 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయడానికి ఆస్ట్రేలియాకు 41 బంతులు సరిపోయాయి. కొత్త కుర్రాడు జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ 18 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులు చేసి ధాటిగా ఆడాడు. మరో ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ 16 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ గెలవడంతో ఆస్ట్రేలియా సిరీస్ ను 3-0 తో క్లీన్ స్వీప్ చేసింది. సిరీస్ మొత్తం టాప్ బౌలింగ్ తీరుతో ఆకట్టుకున్న బార్ట్ లెట్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి. అంతకముందు ఇరు జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ 1-1 తో సమమైన సంగతి తెలిసిందే.
#AUSvWI #CricketNews
— Crickskills (@priyansh1604) February 6, 2024
Australia vs West Indies, 3rd ODI
?INNINGS BREAK?
WestIndies:-8️⃣6️⃣ Allout(24.1 overs)
Xavier Barlett - 4/21 Wickets
Australia Need 8️⃣7️⃣ Runs In 5️⃣0️⃣ Overs pic.twitter.com/sxcQqiHJtY