
అడిలైడ్: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. వెస్టిండీస్‌తో మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్ట్‌లో 10 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో నిలిచింది. విండీస్ ఇచ్చిన 26 రన్స్ టార్గెట్‌ను ఆసీస్ 6.4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది. అంతకుముందు 73/6 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం ఆట కొనసాగించిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 35.2 ఓవర్లలో 120 రన్స్‌కు ఆలౌటైంది. హేజిల్‌వుడ్ 5 వికెట్లు తీశాడు. హెడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రెండో టెస్ట్ 25 నుంచి జరుగుతుంది.