బుమ్రాను ఎదుర్కొన్నానని నా మనవళ్లకు చెబుతా: హెడ్‌‌

బుమ్రాను ఎదుర్కొన్నానని నా మనవళ్లకు చెబుతా: హెడ్‌‌

అడిలైడ్‌‌: టీమిండియా స్టార్ పేసర్ జస్‌‌ప్రీత్‌‌ బుమ్రాపై ఆస్ట్రేలియా బ్యాటర్‌‌‌‌ ట్రావిస్ హెడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రా ప్రపంచంలోనే గొప్ప పేసర్లలో ఒకరిగా నిలిచిపోతాడని కితాబిచ్చాడు. తాను బుమ్రాను  ఎదుర్కొన్నానని తన మనవళ్లకు చెబుతానని తెలిపాడు. ‘బుమ్రా చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఈ ఆటలో తను గొప్ప ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా నిలుస్తాడు. బుమ్రాతో ఎలాంటి సవాల్‌ ఉంటుందో మేమంతా అర్థం చేసుకున్నాం. 

అతని బౌలింగ్‌‌లో ఆడటం ఆనందంగా ఉంది. కొన్నేండ్ల తర్వాత కెరీర్‌‌‌‌ను గుర్తు చూసుకుంటూ మేం బుమ్రాను ఎదుర్కొన్నామన్న విషయాన్ని మా మనవళ్లకు చెబితే చాలా సంతోషంగా ఉంటుంది’ అని హెడ్ పేర్కొన్నాడు.