
ఆయన రక్తం చాలా ప్రత్యేకం. అది చాలా అరుదైన రకం. ఆయన రక్తంలో వ్యాధులతో పోరాడే యాంటీ బాడీస్ చాలా ఉన్నాయి. తన రక్తం దానం చేసి ఎన్నో పసికందుల ప్రాణాలు నిలిపాడు. నవజాత శిశువులకు ప్రాణం పోశాడు. ఆయనను "Man with the Golden Arm" అని అందరూ గుర్తుంచుకునేలా గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు. తన రక్త దానంతో 20 లక్షల మంది నవజాత శిశువులను కాపాడిన ఆ పెద్దాయన ఇక లేరు. అంత గొప్ప మనిషి కాలం చేశారు. 88 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. తన జీవిత కాలంలో 1,111 సార్లు రక్తదానం చేసి చిన్నారుల ప్రాణాలను నిలిపిన ఆ పెద్దాయన చనిపోయారన్న విషయం తెలిసి లక్షల మంది తల్లులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఆయన పేరు జేమ్స్ హారిసన్. చాలామంది ఏడాదికి ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తే చాలు అనుకుంటారు. కొందరైతే అసలు బ్లడ్ ఇవ్వనే కూడదంటారు. అతికొద్దిమంది మాత్రమే తరచుగా బ్లడ్ డొనేట్ చేస్తూ తమ ఉదారత్వం చాటుకుంటుంటారు. కానీ.. జేమ్స్ హారిసన్ మనసున్న మానవుడు. 88 ఏళ్లుగా ఆయన రక్తదానం చేస్తూనే ఉన్నాడు. ఎంతగా అంటే.. 3 వారాలకు ఒకసారి అతడు తన రక్తాన్ని దానం చేశాడంటే నమ్మగలరా. నమ్మాల్సిందే. అందుకే అతడిని ఆస్ట్రేలియా దేశం హీరోగా భావిస్తోంది.
జేమ్స్ హారిసన్ 1936 డిసెంబర్ 27న పుట్టారు. 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు.. అతడికి ఛాతి భాగంలో ఆపరేషన్ జరిగింది. 13 లీటర్ల బ్లడ్ అవసరం అయింది. సర్జరీ తర్వాత 3 నెలలు హాస్పిటల్ లోనే ఉన్నాడు. రక్తమే తనను రక్షించిందని ఆయన అనుకున్నాడు. తన రక్తం కూడా వేరేవాళ్లకు ఇలాగే ప్రాణం పోయాలని భావించి.. 18 ఏళ్ల వయసు వరకు ఆగి.. ఆ తర్వతా క్రమం తప్పకుండా ఆయన రక్తదానం చేస్తూ వచ్చాడు.
రీసస్ అనే వ్యాధిని నయం చేసే యాంటీబాడీలు ఎక్కువగా ఉన్న.. చిక్కదనపు రక్తం ఆయనకు ఉందని రక్త పరీక్షల్లో తేలింది. చిన్నపిల్లల్లో రక్తానికి సంబంధించిన వ్యాధి(Hemolytic disease of new born)ని నయం చేసే లక్షణాలు అతడి రక్తంలో ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. నవజాత శిశువుల రక్తంలో Rh D సమస్యను అధిగమింపచేసే.. యాంటీ D యాంటీబాడీస్ .. హారిసన్ రక్తంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు తెలింది. అలా.. HDN అనే వ్యాధి బారిన పడి చనిపోకుండా.. హారిసన్ రక్తం పసిపిల్లలకు సంజీవనిగా పనిచేసింది.
Also Read:-చైనాకు షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్.. టారిఫ్ 20 శాతానికి పెంపు..
హారిసన్ రక్తం అరుదైన రకం అని జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చాక.. అతడికి.. ఒక మిలియన్ డాలర్స్ జీవిత బీమా చేయించారు. ఆ తర్వాత అతడి రక్త నమూనాలతోనే.. యాంటీ –డి ఇమ్యూన్ గ్లోబులిన్ అనే మెడిసిన్ కూడా తయారైంది. అత్యంత అరుదైన తన రక్తంతో.. ఆయన 2.4 మిలియన్ అంటే.. 24 లక్షల మంది గర్భస్త శిశువులకు,. గర్భవతులకు ప్రాణం పోశాడు. అందులో.. ఆయన కూతురు ట్రాసే కూడా ఉంది.