Australian Cricket Awards: క్రికెట్ ఆస్ట్రేలియా అవార్డ్స్.. తళుక్కుమన్న క్రికెటర్లు

Australian Cricket Awards: క్రికెట్ ఆస్ట్రేలియా అవార్డ్స్.. తళుక్కుమన్న క్రికెటర్లు

క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం(ఫిబ్రవరి 03) వార్షిక అవార్డులు ప్రకటించింది. గతేడాది అద్భుత ప్రదర్శన కనపరిచిన ప్లేయర్లకు వాటిని ప్రధానం చేసింది. ట్రావిస్ హెడ్.. ప్రతిష్టాత్మక అలన్ బోర్డర్ మెడల్‌ గెలుచుకోగా.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో కోహ్లీ, బుమ్రాలతో గొడవలు పెట్టుకున్న 19 ఏళ్ల యువ బ్యాటర్ శామ్ కాన్స్టాస్‌ను బ్రాడ్‌మాన్ యంగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించింది.

హేజిల్‌వుడ్.. 

టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా 34 ఏళ్ల పేసర్ హేజిల్‌వుడ్ నిలిచాడు. ఈ పేసర్ గతేడాది ఆస్ట్రేలియా తరఫున తొమ్మిది టెస్టుల్లో ఇందింట మాత్రమే ఆడాడు. ఈ ఐదింటిలో 13.16 సగటుతో 30 వికెట్లు పడగొట్టాడు.

ట్రావిస్ హెడ్.. అలన్ బోర్డర్ మెడల్

ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ అలెన్ బోర్డర్ మెడల్ అందుకున్నాడు. అంతేకాదు, మెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గానూ నిలిచాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గతేడాది ఆస్ట్రేలియా తరఫున అద్భుతంగా రాణించాడు. టెస్టులు, వన్డేలు, టీ20Iలలో కలిపి 1,427 పరుగులు చేశాడు. బ్యాటింగ్‌లో దూకుడు, కీలక సమయాల్లో పరుగులు చేయగల సత్తా ఇతని సొంతం.

అవార్డుల విజేతలు వీరే..

  • 1. షేన్ వార్న్ పురుషుల టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: జోష్ హేజిల్‌వుడ్
  • 2. అలన్ బోర్డర్ మెడల్: ట్రావిస్ హెడ్
  • 3. బెలిండా క్లార్క్ అవార్డు: అన్నాబెల్ సదర్లాండ్
  • 4. మెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: ట్రావిస్ హెడ్
  • 5. ఉమెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: ఆష్లీ గార్డనర్
  • 6. మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: ఆడమ్ జంపా
  • 7. ఉమెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: బెత్ మూనీ
  • 8. ఆస్ట్రేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్: మైఖేల్ బెవన్
  • 9. కమ్యూనిటీ ఇంపాక్ట్ అవార్డు: కామెరాన్ గ్రీన్
  • 10. మెన్స్ డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: బ్యూ వెబ్‌స్టర్
  • 11. ఉమెన్స్ డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: జార్జియా వోల్
  • 12 . బ్రాడ్‌మాన్ యంగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: సామ్ కాన్స్టాస్
  • 13 - బెట్టీ విల్సన్ యంగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: క్లో ఐన్స్‌వోర్ట్