ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్ తీరుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్ ముగిసిన తర్వాత ఆసీస్ డ్రెసింగ్ రూమ్‌లో మార్ష్ ఓ చేతిలో బీరు పట్టుకొని వరల్డ్ కప్‌పై కాళ్లు పెట్టి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
క్రికెటర్లు కలగనే, ఎంతగానో ప్రేమించే వరల్డ్ కప్‌పై మార్ష్ ఇలా కాళ్లు పెట్టడం అతని అహంకారానికి నిదర్శనం అని విమర్శిస్తున్నారు.