Shaun Marsh: మార్ష్ సంచలన నిర్ణయం.. ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్

Shaun Marsh: మార్ష్ సంచలన నిర్ణయం.. ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, మిచెల్ మార్ష్ సోదరుడు షాన్ మార్ష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మార్ష్.. చివరిసారిగా బుధవారం(జనవరి 17)  సిడ్నీ థండర్స్‌తో తన చివరి మ్యాచ్ ఆడనున్నారు.

"నేను రెనిగేడ్స్‌కు ఆడటాన్ని ఎంతో ఇష్టపడ్డాను.. జట్టులోని సహచరులు అందరూ నాకు మంచి స్నేహితులు.. వీరితో నా స్నేహం జీవితాంతం గుర్తుంటుంది. నా ఈ ప్రయాణంలో సహాయపడ్డ కోచ్‌లు, సిబ్బంది మరియు తెరవెనుక ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.." అని మార్ష్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రస్తుతం మార్ష్ వయసు 40 ఏళ్లు. ఈ క్రమంలోనే అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. 2019లో టెస్టు క్రికెట్‌కు, 2023లో అంతర్జాతీయ వన్డేలకు గుడ్‌బై చెప్పిన మార్ష్‌.. అప్పటి నుంచి దేశవాళీ టోర్నీలకే పరిమితమయ్యారు. 2001లో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా తరపున మార్ష్‌ ఫస్ట్ క్లాస్ లో అరంగేట్రం చేశారు. ఆస్ట్రేలియా తరఫున 38 టెస్టు మ్యాచ్‌లు, 73 వన్డేలు, 15 టీ20లు ఆడారు. కాగా, షాన్‌ మార్ష్‌ సోదరుడు మిచెల్‌ మార్ష్‌ ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.