
పారిస్: ఆస్ట్రేలియా హాకీ టీమ్ ప్లేయర్ ఒకరు ఆటను పక్కనబెట్టి పారిస్‌లో కొకైన్ కొనేందుకు ప్రయత్నించి పట్టుబడ్డాడు. బుధవారం అతన్ని కస్టడీలోకి తీసుకున్నట్లు పారిస్ ప్రాసిక్యూటర్స్ ఆఫీస్ వెల్లడించింది. మంగళవారం రాత్రి పారిస్‌లోని 9వ అరోండిస్‌మెంట్ భవనం వెలుపలా జరిగిన డ్రగ్స్ లావాదేవీలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో ఆసీస్ ప్లేయర్ పట్టుబడినట్లు తెలుస్తోంది.
తదుపరి విచారణ కోసం యాంటీ డ్రగ్స్ విభాగానికి అప్పగించారు. 17 ఏళ్ల కుర్రాడి నుంచి ఈ డ్రగ్స్‌ను ఆసీస్ ప్లేయర్ కొనుగోలు చేసేందుకు యత్నించాడని పోలీసులు ఆరోపించారు. ప్రస్తుతానికి ప్లేయర్‌పై ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదని, విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వ్యవహారంపై ఇంటర్నేషనల్ హాకీ సమాఖ్య, ఆసీస్ ఒలింపిక్ కమిటీ ఎలాంటి ప్రకటన చేయలేదు.