Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా హాకీ ప్లేయర్ అరెస్ట్.. కారణం ఏంటంటే..?

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా హాకీ ప్లేయర్ అరెస్ట్.. కారణం ఏంటంటే..?

ఒలింపిక్స్ లో ఆస్ట్రేలియా హాకీ ఆటగాడు అరెస్ట్ అయ్యాడు. ఆస్ట్రేలియా హాకీ నుంచి నిష్క్రయమించిన తర్వాత ఆ దేశ ఆటగాడు టామ్  క్రెయిగ్ రాత్రి కొకైన్ కొనడానికి ప్రయత్నించి పట్టుబడ్డాడు. నివేదికల ప్రకారం క్రెయిగ్ మంగళవారం (ఆగస్ట్ 6) అరెస్టు చేయబడినట్లు తెలుస్తుంది. క్రెయిగ్ పారిస్‌లోని ఒక డీలర్ నుండి డ్రగ్స్ కొనుగోలు చేశాడని సమాచారం. తాజాగా బుధవారం (ఆగస్ట్ 7)ఈ ఆసీస్ ఆటగాడు తన చేసిన తప్పుకు క్షమాపణలు తెలిపాడు.

మూడు సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా టోక్యోలో ఒలింపిక్స్ లో రన్నరప్ గా నిలిచి సిల్వర్ మెడల్ గెలుచుకుంది. ఈ విజయంలో క్రెయిగ్ కీలక పాత్ర పోషించాడు. 28 ఏళ్ల ఈ ఆస్ట్రేలియన్‌కు క్రిమినల్ వార్నింగ్ ఇవ్వబడింది. అరెస్ట్ అయిపోయిన తర్వాత ఒక రాత్రి కస్టడీలో గడిపాడు. అతను విడుదల చేసిన తర్వాత చేసిన తర్వాత ఆస్ట్రేలియా మీడియా ముందు తన క్షమాపణలు తెలిపాడు.

"గత 24 గంటల్లో జరిగిన దానికి నేను ముందుగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. నేను ఘోరమైన తప్పు చేశాను. నేను చేసిన పనికి పూర్తి బాధ్యత వహిస్తాను. ఇందులో నా కుటుంబం, సహచరులు, స్నేహితులు, ఆస్ట్రేలియన్ ఒలింపిక్ జట్టుకు సంబంధం లేదు. నేను మీ అందరినీ ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించండి". అని క్రెయిగ్ చెప్పుకొచ్చాడు.