Australian Open: సెమీస్ ఏకపక్షం.. ఫైనల్లో సిన్నర్

Australian Open: సెమీస్ ఏకపక్షం.. ఫైనల్లో సిన్నర్

ప్రపంచ నెం.1 ర్యాంకర్, ఇటలీ టెన్నిస్ స్టార్ జానిక్ సిన్నర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్లో అడుగుపెట్టాడు. శుక్రవారం 20వ ర్యాంకర్ బెన్ షెల్టన్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో 7-6 (2), 6-2, 6-2 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్‌లోకి ప్రవేశించాడు. 

తొలి సెట్‌ టై బ్రేక్ వరకు వెళ్లినప్పటికీ, మిగిలిన రెండు సెట్లను సిన్నర్ ఏకపక్షంగా ముగించాడు. 6-2, 6-2 తేడాతో సొంతం చేసుకున్నాడు. ఆదివారం సెంటర్ కోర్ట్‌లో ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో సిన్నర్ తలపడనున్నాడు. 

ALSO READ | Ranji Trophy: తిప్పేసిన జడేజా.. ఒక్కడే 12 వికెట్లు.. ఢిల్లీపై సౌరాష్ట్ర విజయం

ఈ విజయంతో సిన్నర్ 1992-93లో జిమ్ కొరియర్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అత్యధిక సార్లు ఫైనల్స్‌ చేరిన అతి పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్‌లు గెలుచుకున్న సిన్నర్.. నోవాక్ జొకోవిచ్ ను వెనక్కినెట్టి నెంబర్.1 ర్యాంక్ సొంతం చేసుకున్నాడు.