Australian Open 2025: స్వియాటెక్‌ ఔట్.. ఫైనల్లో అమెరికన్ స్టార్

Australian Open 2025: స్వియాటెక్‌ ఔట్.. ఫైనల్లో అమెరికన్ స్టార్

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో సంచలన విజయం నమోదైంది. గురువారం జరిగిన సెమీఫైనల్ పోరులో ప్రపంచ నెం. ర్యాంకర్ 2 ఇగా స్వియాటెక్‌.. అమెరికన్ ప్లేయర్ మాడిసన్ కీస్ చేతిలో ఓటమి పాలైంది. కీస్ 5-7, 6-1, 7-6(8)తో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.

థ్రిల్లర్‌ సినిమా..

సెమీఫైనల్ పోరు థ్రిల్లర్‌ సినిమాను తలపించింది. తొలి సెట్ స్వియాటెక్‌ గెలుచుకోగా.. రెండో సెట్ మాడిసన్ సొంతం చేసుకుంది. ఇక నిర్ణయాత్మక సెట్‌లో ఇద్దరు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. స్వియాటెక్‌ ఈజీగా గెలిచే అవకాశాలను చేజార్చుకుంది.

ALSO READ | Ranji Trophy: ఒక్కడే 9 వికెట్లు.. రంజీల్లో 24 ఏళ్ళ స్పిన్నర్ సంచలన బౌలింగ్

మాడిసన్ కీస్‌కు ఇది రెండో గ్రాండ్ స్లామ్ ఫైనల్‌. 2017 US ఓపెన్‌లో ఫైనల్‌ చేరిన కీస్.. తోటి అమెరికన్ ప్లేయర్ స్లోన్ స్టీఫెన్స్ చేతిలో 6-3 6-0 తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచే అవకాశం మరోసారి వచ్చింది.

శనివారం(జనవరి 25)  అరేనా సబలెంకా, మాడిసన్ కీస్ మధ్య ఫైనల్ జరగనుంది