Madison Keys: ఆస్ట్రేలియన్ ఓపెన్‌.. మహిళల సింగిల్స్ విజేత మాడిసన్ కీస్

Madison Keys: ఆస్ట్రేలియన్ ఓపెన్‌.. మహిళల సింగిల్స్ విజేత మాడిసన్ కీస్

ఆస్ట్రేలియన్ ఓపెన్‌ మహిళల సింగిల్స్ విజేతగా అమెరికన్ క్రీడాకారిణి మాడిసన్ కీస్(Madison Keys) నిలిచింది. శనివారం ప్రపంచ నెం. 1 ర్యాంకర్, డిఫెండింగ్ ఛాంపియన్ అరీనా సబలెంకాతో జరిగిన ఫైనల్లో పోరులో 6-3, 2-6, 7-5 తేడాతో విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. అమెరికన్ టెన్నిస్ స్టార్‌కు ఇది తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్. 2017 యూఎస్ ఓపెన్ రన్నరప్‌గా నిలిచింది.

థ్రిల్లర్ మూవీ.. 

మొదటి రెండు సెట్లు చెరొకటి గెలవడంతో.. నిర్ణయాత్మక మూడో సెట్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. ఒకొనక సమయంలో ఇద్దరూ 5-5తో సమంగా ఉన్నారు. ఆ సమయంలో తన ఆరో సర్వ్ నిలబెట్టుకున్న కీస్.. అరీనా సబలెంకా సర్వ్ బ్రేక్ చేసి 7-5తో మూడో సెట్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ ఆఖరి పాయింట్ వరకూ ఉత్కంఠను తలపించింది. ఒత్తిడిని జయించిన కీస్.. ట్రోఫీతో పాటు  3.5 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ. 30 కోట్లు) ప్రైజ్ మనీ సొంతం చేసుకుంది.

అంతకుముందు కీస్.. సెమీఫైనల్లో ప్రపంచ నెం. ర్యాంకర్ 2 ఇగా స్వియాటెక్‌‌ను మట్టికరిపించింది.  5-7, 6-1, 7-6(8)తో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.