- సినర్, స్వైటెక్ ముందంజ
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. రష్యా టాప్ ప్లేయర్ డానిల్ మెద్వెదెవ్ రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్‌లో క్వాలిఫయర్ లెర్నర్ టియన్ (అమెరికా) 6–3, 7–6 (7/4), 6–7 (8/10), 1–6, 7–6 (10/7)తో ఐదోసీడ్ మెద్వెదెవ్కు షాకిచ్చాడు. దీంతో పీట్ సంప్రాస్ (1990) తర్వాత ఈ టోర్నీలో మూడో రౌండ్‌కి చేరిన యంగెస్ట్ అమెరికన్ ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. 4 గంటలా 49 నిమిషాల మ్యాచ్‌లో 82 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్ చేసిన రష్యన్‌కు ఓటమి తప్పలేదు. 20 ఏస్‌లు కొట్టిన మెద్వెదెవ్ 9 డబుల్ ఫాల్ట్స్ చేశాడు.
52 విన్నర్లతో పాటు 24 బ్రేక్ పాయింట్లలో పది మాత్రమే కాచుకున్నాడు. 15 బ్రేక్ పాయింట్లలో 9 కాపాడుకున్న టియన్ 53 విన్నర్లు కొట్టాడు. 7 ఏస్‌లు, 4 డబుల్ ఫాల్ట్స్‌తో తన సర్వీస్‌లో 71 శాతం పాయింట్లు రాబట్టాడు. ఇతర మ్యాచ్‌లో జానిక్ సినర్ (ఇటలీ) 4–-6, 6–-4, 6–-1, 6–-3తో స్కూల్‌కేట్ (ఆస్ట్రేలియా)పై, డి మినుయెర్ (ఆస్ట్రేలియా) 6-–2, 6-–-4, 6–-3తో బోయర్ (అమెరికా)పై, టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–-2, 6–-1, 6–-0తో క్రిస్టియన్ గారిన్ (చిలీ)పై, హోల్గర్ రునె (డెన్మార్క్) 7–-6 (7/3), 2–-6, 6–-3, 7–-6 (7/8)తో బెరెటినీ (ఇటలీ)పై, ఫ్యాబియన్ మరోజాసన్ (హంగేరి) 6–-7 (3/7), 6–-4, 3–-6, 6–-4, 6–-1తో తియాఫో (అమెరికా)పై, కెక్మనోవిచ్ (సెర్బియా) 6-–4, 6–-4, 6–-2తో 18వ సీడ్ హుర్కాజ్ (పోలెండ్)పై గెలిచారు.
విమెన్స్ సింగిల్స్ రెండో రౌండ్లో స్వైటెక్ 6–0, 6–2తో రెబెకా సమరకోవా (స్లొవేకియా)పై, నవారో (అమెరికా) 6–3, 3–6, 6–4తో వాంగ్ (చైనా)పై, రిబకినా (కజకిస్తాన్) 6–0, 6–3తో జోవిక్ (అమెరికా)పై, కీస్ (అమెరికా) 7–6 (7/1), 2–6, 7–5తో రుస్ (రొమేనియా)పై, పౌలిని (ఇటలీ) 6–2, 6–3తో జరాజువా (మెక్సికో)పై, కసాట్కినా (రష్యా) 6–2, 6–0తో యిఫాన్ వాంగ్ (చైనా)పై, కొలిన్స్ (అమెరికా) 7–6 (7/4), 4–6, 6–2తో అయెవా (ఆస్ట్రేలియా)పై నెగ్గి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. మెన్స్ డబుల్స్ తొలి రౌండ్లో ఇండియాకు చెందిన ఎన్. శ్రీరామ్ బాలాజీ–మిగుల్ రీయెస్ (మెక్సికో) 6–4, 6–3తో రాబిన్ హాస్ (డచ్)–అలెగ్జాండర్ నెడోవెయెసోవ్ (కజకిస్తాన్)పై గెలిచి రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. మరో మ్యాచ్‌లో రిత్విక బొల్లిపల్లి–రేయన్ సెగర్మన్ (అమెరికా) 6–7 (5/7), 1–6తో హ్యారీ హెలివోరా (ఫిన్లాండ్), హెన్రీ ప్యాటెన్ (బ్రిటన్) చేతిలో ఓటమిపాలయ్యారు.