చెన్నై : ఆస్ట్రేలియా స్టార్ పేసర్, ఐపీఎల్ ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన మిచెల్ స్టార్క్.. మెగా లీగ్‌తో పాటు ఫ్రాంచైజీ క్రికెట్‌పై మరింత ఫోకస్ పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇందుకోసం ఓ ఇంటర్నేషనల్ ఫార్మాట్ నుంచి తప్పుకోవాలని చూస్తున్నట్టు స్టార్క్ తెలిపాడు. ఏ ఫార్మాట్ అనేది తను స్పష్టం చేయకపోయినా.. వన్డేలకు వీడ్కోలు చెప్పే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
గత తొమ్మిదేండ్లలో నేను ఆస్ట్రేలియా టీమ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చా. నా బాడీకి రెస్ట్ ఇవ్వడానికి, ఫ్యామిలీతో సమయం గడపడానికి మాత్రమే కొన్నిసార్లు బ్రేక్ తీసుకున్నా. ఇప్పుడు నా కెరీర్‌లో చివరి దశ మొదలవుతోంది. కాబట్టి ఒక ఫార్మాట్ నుంచి తప్పుకుంటే ఫ్రాంచైజీ క్రికెట్ ఎక్కువ ఆడేందుకు అవకాశం లభిస్తుంది’ అని పేర్కొన్నాడు. కేకేఆర్ ఫ్రాంచైజీ అవకాశం ఇస్తే వచ్చే ఏడాది కూడా ఆ జట్టుతోనే ఉంటానని తెలిపాడు.