AUS vs IND: భారత క్రికెటర్లకు ఆస్ట్రేలియా ప్రధాని ఆతిథ్యం

AUS vs IND: భారత క్రికెటర్లకు ఆస్ట్రేలియా ప్రధాని ఆతిథ్యం

సిడ్నీ టెస్టుకు ముందు భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్లకు ఆ దేశ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ ఆతిథ్యమిచ్చారు. ఈ ఆతిథ్య వేడుకలో ఆసీస్ ప్రధాని ఇరు జట్ల ఆటగాళ్లతో కాసేపు ముచ్చటించారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. అల్బనీస్ తనకు కాబోయే భార్య జోడీ హెడన్‌ను ఈ విందుకు తీసుకొచ్చారు. తనకు కాబోయే సతీమణికి ప్రతి ఒక్క క్రికెటర్‌ను పేరు పేరున పరిచయం చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలను ఆస్ట్రేలియా ప్రధాని తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పంచుకున్నారు.

బుమ్రాపై ప్రశంసలు

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో నాలుగు మ్యాచ్‌ల్లో 30 వికెట్లు తీసిన భారత స్పీడ్ గన్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రధాని అల్బనీస్ పొగడ్తల వర్షం కురిపించారు. బుమ్రా బౌలింగ్ చేయకుండా ఉండేలా ఒక వినూత్న చట్టం తీసుకొస్తే బాగుంటుందంటూ అందరిని ఆట పట్టించారు. 

"అతను(బుమ్రా) లెఫ్ట్ హ్యాండ్‌తో బౌలింగ్ చేసేలా కావొచ్చు లేదా స్పిన్నర్లలా ఎక్కువ రనప్ తీసుకోకుండా బౌలింగ్ చేసేలా కావొచ్చు మేము ఒక చట్టాన్ని ఆమోదించవచ్చు. అతను బౌలింగ్ చేయడానికి వచ్చిన ప్రతిసారీ ఉత్కంఠ వాతావరణం కనిపిస్తోంది. ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ప్రతి క్షణం అభిమానుల్లో నేను చూశాను.." అని అల్బనీస్ భారత పేసర్‌ను కొనియాడారు.

ఈ ఇరు జట్ల మధ్య శుక్రవారం (జనవరి 03) నుంచి సిడ్నీ వేదికగా ఆఖరి టెస్ట్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో ఆసీస్ 2-1 తేడాతో ముందంజలో ఉంది. టీమిండియా ఆఖరి టెస్టులో గెలిస్తే, సిరీస్ సమం అవుతుంది.

ALSO READ | Team India: ఆడటం ఇష్టం లేకుంటే తప్పుకోండి.. డ్రెస్సింగ్ రూమ్‌లో గంభీర్ మాస్ బ్యాటింగ్