పాఠ్యాంశాల్లో ప్రాథమిక సబ్జెక్టుగా క్రికెట్.. ఏ దేశంలో అంటే..?

సాధారణంగా పుస్తకాల్లో గొప్ప క్రికెటర్ గురించి ఒక పాఠం ఉండడం.. క్రికెట్ గురించి ఒక చాప్టర్ ఉండడం సహజం. కానీ ఒక దేశంలో మాత్రం క్రికెట్ నే ఒక సబ్జెక్టుగా చేయబోతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆ దేశం మరేదో కాదు.. క్రికెట్ లో ఎన్నో  ఏళ్లుగా తమ ఆధిపత్యాన్ని చూపించిన ఆస్ట్రేలియా. నివేదికల ప్రకారం ఆస్ట్రేలియాలోని ఒక స్కూల్స్ లో క్రికెట్ ను వారి ప్రాథమిక  సబ్జెక్టుగా చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో క్రికెట్ కూడా వారి పుస్తకాల్లో ఒక పాఠం కాకుండా ఒక సబ్జెక్టు కాబోతుంది.           

వస్తున్న సమాచార ప్రకారం.. విక్టోరియాలోని  లారా సెకండరీ కాలేజ్ క్రికెట్‌ను కేవలం పాఠ్యేతర కార్యకలాపంగా కాకుండా అధికారిక సబ్జెక్ట్‌గా తొలిసారి  పరిచయం చేసింది. విక్టోరియాలోని పాఠశాలల్లో విద్యార్థులకు క్రికెట్ గురించి బోధించడం అకాడమీ ఉద్యమం యొక్క లక్ష్యం. క్రికెట్ లో ఆస్ట్రేలియాకు ఘనమైన చరిత్ర ఉంది. క్రికెట్ ను కనిపెట్టింది ఇంగ్లాండ్ అయినా శాసించింది మాత్రం ఆస్ట్రేలియా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని దశాబ్దాలుగా క్రికెట్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసి టాప్ లో నిలిచారు. క్రికెట్ పై తమదైన ముద్ర వేస్తూ ఏకంగా 6 వన్డే వరల్డ్ కప్ ట్రోఫీలు గెలుచుకున్నారు.