ఓ లేడీ టీచర్ బరితెగించింది. కా...... కళ్లు మూసుకుపోయి విద్యార్థుల్ని బెదిరించి లైంగికంగా వేధిస్తోంది. ఏదో ఘనకార్యం చేస్తున్నట్లు సెల్ఫీలు తీసుకొని రాక్షసానందం పొందుతోంది. ఈ ఘటనపై విచారణ జరిపిన అధికారులు.. కేసును పోలీసులకు అప్పగించారు. దీంతో టీచర్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కేసు విచారణలో బయటపడిన విషయాలతో పోలీసులే కంగుతిన్నారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది
సమాజంలో గురువులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పిల్లలకు విద్యాబుద్దులు నేర్పి..వారిని ఉన్నత స్థాయికి చేరేందుకు ఎంతో కృషి చేస్తుంటారు. చాలా మంది ఉపాధ్యాయులు విద్యార్థులను తమ సొంత బిడ్డల్లా భావింస్తుంటారు. ఇదే సమంయలో కొందరు మాత్రం టీచర్ వృతికి అపకీర్తి తెస్తున్నారు. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ గురువు అనే స్థానానికి చెడ్డపేరు తెస్తున్నారు. ఇలాంటి వారిలో కొందరు మహిళా టీచర్ల కూడా ఉన్నారు. తాజాగా ఓ మహిళా టీచర్… 17 విద్యార్థిని లైంగిక వేధింపులకు గురి చేసింది. చివరకు ఆమెకు కోర్టు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం..
ఆస్ట్రేలియాలోని నైరుతి సిడ్నీలోని లుర్నియా హైస్కూల్ తైలా బ్రాలీ (30) అనే మహిళ టీచర్ గా విధులు నిర్వహిస్తుంది. ఆమెకు 17 ఏళ్ల విద్యార్థితో స్నాప్ చాట్ ద్వారా పరిచయం చేసుకుంది. ఇదే సమయంలో పరస్పరం ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. అంతేకాక ఆమె తన వ్యక్తిగత ఫోటోలను ఆ విద్యార్థికి పంపించేది. అంతేకాక తన ప్రైవేటు ఫోటోలు వీడియోలను కూడా ఆ విద్యార్థికి పంపేదని స్థానిక పోలీసులు తెలిపారు. అలానే బాలుడు కూడా తన వ్యక్తిగత ఫోటోలు ఆ మహిళకు పంపే వాడు.
ఇదిలా ఉండగా ఒక రోజు బ్రెయిలీ ఆ విద్యార్థిని తన ఇంటికి ఆహ్వానించింది. అక్కడ ఆమె అతన్ని మేడమీద గదికి తీసుకెళ్లి ముద్దు పెట్టుకుంది. అంతేకాక ఆ విద్యార్థితో అసభ్యకరంగా ప్రవర్తించింది. ఆ ఘటన జరిగిన వారం రోజుల తరువాత బ్రాలీ స్కూల్‌లో ఉండగానే ఆ విద్యార్థిని పిలిచింది. తాను తాను ఒక గంట పాటు ఖాళీగా ఉన్నానని చెప్పింది. ఈ క్రమంలోనే పాఠశాల బయటబ్రాలీ కారులో వారిద్దరు అసభ్యకరంగా వ్యవహరించినట్లు తమ విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
టీచర్ బ్రాలీపై లైంగిక వేధింపుల ఆరోపణలు బయటకు వచ్చాయి. వాటిపై విచారణ చేపట్టిన పోలీసులు..నిజమని తేలడంతో..బ్రాలీని అరెస్టు చేశారు. అనంతరం క్యాంప్‌బెల్‌టౌన్ కోర్టులో ఆమెను హాజరు పర్చారు. ఆమె విధుల్లో ఉంటూ పిల్లలను లైంగిక వేధింపులను గురిచేసినట్లు చేసినట్లు అభియోగాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆమె ప్రవర్తించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తాను తన కుటుంబాన్ని, తన భర్తను, ఉద్యోగాన్ని పోగొట్టుకోబోతున్నానని చెప్పుకొచ్చింది.