మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియా విమెన్స్ టీమ్ కెప్టెన్ మెగ్ లానింగ్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గురువారం రిటైర్మెంట్ ప్రకటించింది. 13 ఏళ్ల కెరీర్‌లో ఆసీస్‌కు ఏడు వరల్డ్ టైటిల్స్ అందించింది. ఇందులో కెప్టెన్‌గా ఐదు టైటిల్స్ సాధించింది. కెరీర్‌లో 6 టెస్ట్‌లు, 103 వన్డేలు, 132 టీ20లు ఆడిన లానింగ్ 8352 రన్స్ చేసింది. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నా.. వరల్డ్ వైడ్‌గా జరిగే టీ20 లీగ్‌లకు అందుబాటులో ఉంటానని లానింగ్ ప్రకటించింది.
‘కెరీర్‌కు వీడ్కోలు పలకడం చాలా క్లిష్టమైన నిర్ణయం. కానీ ఇదే సరైన సమయం. నా 13 ఏళ్ల కెరీర్ అద్భుతంగా సాగింది. టీమ్ సక్సెసే నా విజయంగా భావించా’ అని 31 ఏళ్ల లానింగ్ పేర్కొంది. లానింగ్ ప్లేస్‌లో అలీసా హీలీ కెప్టెన్‌గా వ్యవహరించనుంది.