క్రికెట్‌కు రిటైర్మెంట్‌ .. ఆస్ట్రేలియా కెప్టెన్‌ భాగోద్వేగం

క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ..  ఆస్ట్రేలియా కెప్టెన్‌ భాగోద్వేగం

ఆస్ట్రేలియా లెజెండరీ కెప్టెన్ మెగ్ లానింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. గొప్ప కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న మెగ్ లానింగ్ ఆస్ట్రేలియా మహిళల జట్టుకు ఐదు ప్రపంచ కప్ టైటిళ్లకు అందించింది.  31 ఏళ్ల మెగ్ లానింగ్ క్రికెట్ కు  రిటైర్మెంట్ ప్రకటిస్తూ భాగోద్వేగానికి లోనైంది.  ఆమె కంటతడి పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  మెగ్ లానింగ్ 182 మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించింది.  

అంతర్జాతీయ క్రికెట్ నుండి వైదొలగాలనే నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం, కానీ ఇప్పుడు నాకు ఇది సరైన సమయం అని భావిస్తున్నాను. 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌ను ఆస్వాదించినందుకు  నేను చాలా అదృష్టవంతురాలిని కెరీర్ లో సహచరులతో పంచుకున్న క్షణాలను ఎంతో మధురమైనవి అని మెగ్ లానింగ్ తెలిపింది.   మెగ్ లానింగ్ తన 13 ఏళ్ల కెరీర్‌లో 241 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆసీస్‌కు ప్రాతినిథ్యం వహించి, 182 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించింది. ఫుల్‌టైమ్‌ బ్యాటర్‌, పార్ట్‌ టైమ్‌ బౌలర్‌ అయిన ఈమె తన కెరీర్‌లో 17 సెంచరీలు, 38 హాఫ్‌ సెంచరీలు, 5 వికెట్లు పడగొట్టింది.