- రిజర్వేషన్లపై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ
- బ్యాలెట్డబ్బాల రిపేరింగ్ షురూ
- ఎన్నికల నిర్వహణపై మండల ఆఫీసర్లకు బుక్స్ పంపిణీ
- పోలింగ్ సెంటర్స్‌పై పూర్తి క్లారిటీ
నిజామాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టిసారించింది. నోటిఫికేషన్ వచ్చే టైంకు అన్నీ సిద్ధం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో స్టేట్‌ఎలక్షన్ కమిషన్ నుంచి అందుతున్న ఆదేశాలను ఎప్పటికప్పుడు గ్రౌండ్లో అమలు చేస్తూ రిపోర్టు పంపుతున్నారు. రిజర్వేషన్లు ఎలా ఉంటాయోనని రాజకీయ పార్టీల్లో చర్చ జరుగుతోంది.
30 సింబల్స్‌తో బ్యాలెట్ ప్రింటింగ్
పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలు పేపర్ బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తారు. బ్యాలెట్ పూపర్పై సింబల్స్ మాత్రమే ఉంటాయి. వాటిపై పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఉండవు. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులే తమకు కేటాయించిన గుర్తులు ప్రచారం చేసుకుంటారు. కమిషన్ ఆదేశాల ప్రకారం జిల్లాలో బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ కోసం స్పెషల్‌గా నోడల్ ఆఫీసర్లను నియమించారు. వారి పర్యవేక్షణలో మంగళవారం నుంచి వాటి ప్రింటింగ్ జరుగనుంది. మొత్తం 30 ఎన్నికల సింబల్స్‌ను ఇందుకోసం వినియోగించనున్నారు.
2019 ఎలక్షన్ టైంలో 15 సింబల్స్‌తో బ్యాలెట్ రూపొందించారు. నిబంధనలను అనుసరించి ఇప్పుడు మొత్తం 30 గుర్తులతో బ్యాలెట్లు రూపొందనున్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం నుంచి వచ్చిన హ్యాండ్ బుక్స్‌ను సోమవారం వరకు ఎంపీడీవోలకు అందజేశారు. పది బుక్స్‌తో ఉన్న ఒక సెట్‌ను ట్రైనింగ్ షురూ చేసేనాటికి ఒకసారి చదవాలని ఎంపీడీవోలను ఆదేశించారు. కమిషన్ నుంచి మరికొన్ని బుక్స్, మెటీరియల్ రానుందని ఆఫీసర్లు తెలిపారు. గత ఎలక్షన్లో బ్యాలెట్ పేపర్ల కోసం ఉపయోగించిన బాక్స్‌ల రిపేర్లకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జడ్పీ ఆఫీస్‌లో భద్రపర్చిన పోలింగ్బాక్స్ ల్లో అదనంగా ఉన్నవాటిని వారం కింద పొరుగు జిల్లాలకు తరలించారు.
600 ఓటర్లకు ఒక పోలింగ్ సెంటర్
పెంచిన15 గ్రామ పంచాయతీలు కలిపి జిల్లాలో మొత్తం 545 పంచాయతీలు, 5,022 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి. పల్లె ఓటర్లుగా 8,30,580 తేలారు. వారిలో పురుషులు 3,87,017, మహిళలు 4,43,548, ట్రాన్స్జెండర్లు 15 మంది ఉన్నారు. ప్రతి 600 మందికి ఒక పోలింగ్సెంటర్ చొప్పున మొత్తం 5,053 సెంటర్లను ఈ నెల17న కలెక్టర్ రాజీవ్‌గాంధీ అఫీషియల్‌గా ప్రకటించారు. ఆ లిస్టును ఎంపీడీవో, గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో అంటించారు. ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి కరెంట్, మరుగుదొడ్లు వసతులపై రిపోర్ట్ ఇవ్వాలని ఎంపీవోలకు ఆదేశించారు.
దాని ప్రకారం రిపేర్లు చేయిస్తారు. ఈనెల 10న అదనపు కలెక్టర్అంకిత్ పంచాయతీ ఎన్నికలపై పొలిటికల్ పార్టీలతో మీటింగ్ నిర్వహించారు. 12న మండల స్థాయిలో రాజకీయ పార్టీల లోకల్ లీడర్లతో సమావేశం జరిగింది. ప్రతి పనీ పార్టీలకు తెలిసేలా పారదర్శకంగా చేస్తున్నారు.
మరో పక్క పంచాయతీ రిజర్వేషన్లు స్థానిక పార్టీ నేతలను టెన్షన్ పెడుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరితో సర్పంచ్పదవీ కాలం ముగియగా అప్పటి నుంచి పల్లెల్లో స్పెషల్ఆఫీసర్ల పాలన నడుస్తున్న సంగతి తెలిసిందే.స్టేట్ ఎలక్షన్ కమిషన్ఆదేశాలతో యంత్రాంగంతో పనులు చేయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా పంచాయతీ ఎన్నికలకు రెడీ అయింది. బీసీ రిజర్వేషన్ పెంచడానికి కులగణన చేపట్టి బీసీ కమిషన్, డెడికేటెడ్ కమిషన్‌ను అపాయింట్ చేసింది.