- సందర్శకులకు మెరుగైన సేవలు అందేలా ప్లాన్
- త్వరలో అందుబాటులోకి ఫాస్ట్ ట్యాగ్, మిర్రర్ ఎన్క్లోజర్లు
- జూ పార్క్ పూర్తి సమాచారంతో రెడీ అవుతున్న ‘జూ పీడియా’
- ఇంటి నుంచే జంతువులను చూసేలా లైవ్‌స్ట్రీమింగ్
హైదరాబాద్, వెలుగు: సిటీలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో సందర్శకులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. టెక్నాలజీని వినియోగించుకుంటూ సరికొత్త మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే జూపార్కులో ఈ–టికెటింగ్, ఈ – వెహికల్స్ బుకింగ్, ఈ– వెహికల్స్ కు జీపీఎస్, సోలార్సీసీ కెమెరాలతో నిఘా, థర్మల్ డ్రోన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. జీఐఎస్, జీపీఎస్ టెక్నాలజీతో యానిమల్ ఎన్క్లోజర్లను మ్యాపింగ్ చేస్తున్నారు. త్వరలో పార్కింగ్ ఏరియాలో ఫాస్టాగ్అమలులోకి రానుంది. జూపార్క్, జంతువుల పూర్తి వివరాలను తెలియజేసేలా అధికారులు జూ పీడియా యాప్ ను తీసుకురాబోతున్నారు.
మిర్రర్ బారియర్ ఎన్క్లోజర్లు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం స్నేక్స్, బర్డ్స్‌కు మాత్రమే మిర్రర్ బారియర్ఎన్ క్లోజర్లు ఉన్నాయి. త్వరలో పెద్ద జంతువులకు కూడా మిర్రర్ బారియర్స్ పెట్టనున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే సింహం, పులులు, ఇతర పెద్ద జంతువులను సందర్శకులు దగ్గరగా చూడొచ్చు. విదేశాల్లోని జూపార్కుల్లో మిర్రర్ బారియర్స్ ను ఎక్కువగా వాడుతున్నారు. అదే తరహాలో ఇక్కడ అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు.
జూ పీడియాతో నేవిగేషన్
జూ పార్క్అధికారులు త్వరలో జూ పీడియా పేరుతో యాప్ తీసుకురాబోతున్నారు. దీని ద్వారా జూపార్కులో ఏయే జంతువు ఏ ప్లేస్‌లో ఉందో సందర్శకులు ఈజీగా తెలుసుకోవచ్చు. యాప్‌లో నేవిగేషన్ అందుబాటులో ఉంటుంది. జంతువులతో పాటు రెస్టారెంట్లు, టికెట్ కౌంటర్, బేబీ ఫీడింగ్ సెంటర్, పార్కింగ్ ఏరియా, రెస్ట్ రూమ్స్ అన్నింటికి సంబంధించిన సమాచారం అందులో ఉంటుంది. సెర్చ్ చేస్తే నేవిగేషన్ ద్వారా అక్కడికి చేరుకోవచ్చు. జంతువులు, చెట్లకు సంబంధించిన ఆడియోలు, టెక్ట్స్ రూపంలో సమాచారం యాప్‌లో ఉంటుంది.
పార్కింగ్ ఏరియాలో ఫాస్టాగ్
జూ పార్కుకు రోజూ వేలాది మంది వస్తుంటారు. వీకెండ్స్రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం జూపార్క్ పార్కింగ్ఏరియాలో మాన్యువల్‌గా పార్కింగ్‌ఫీజు వసూలు చేస్తున్నారు. త్వరలో ఫాస్టాగ్ సిస్టమ్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. పార్కింగ్ ఏరియాలో ఫాస్టాగ్‌కు సంబంధించిన నిర్మాణం పూర్తి కావచ్చింది. త్వరలోనే ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. లైవ్ స్ట్రీమింగ్.. వీఆర్ టెక్నాలజీత్వరలో జూపార్కులో లైవ్ స్ట్రీమింగ్ తీసుకురానున్నారు. ఈ సదుపాయంతో యానిమల్ ఎన్ క్లోజర్ల వద్ద ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా ఇంటి నుంచే జంతువులను లైవ్‌లో చూడొచ్చు.
జంతువుల కదలికలు, అవేం చేస్తున్నాయో తెలుసుకోవచ్చు. ఈ తరహా టెక్నాలజీ చెన్నై జూపార్కులో ఇప్పటికే అమలులో ఉంది. త్వరలో హైదరాబాద్ జూపార్కులోనూ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే వర్చువల్ టెక్నాలజీని(వీఆర్)ని సందర్శకులకు అందించనున్నారు. జూపార్క్‌లోని ఓ పాయింట్ వద్ద ఉంచున్నారు. వీఆర్ హెడ్సెట్ పెట్టుకుంటే జూలోని జంతువులు మన పక్కనే, ఎదురుగా తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది.
యానిమల్స్‌కు మైక్రో చిప్స్
జంతువులను గుర్తుపట్టేందుకు, వాటి హిస్టరీని తెలుసుకునేందుకు జూపార్క్అధికారులు ఒక్కో యానిమల్కు మైక్రోచిప్ అమర్చారు. వీటిని పీఏటీ ట్యాగ్స్ అంటారు. జూపార్కులో ఒకే రకమైన జంతువులు చాలా ఉంటాయి. ప్రతి జంతువును మానిటర్ చేసేందుకు, అవసరమై ట్రీట్మెంట్ అందించేందుకు ఈ పీఏటీ ట్యాగ్స్ఉపయోగపడుతున్నాయి. చిప్ ద్వారా ప్రతి జంతువుకు ఓ నంబర్ ఉంటుంది. స్కాన్ చేయగానే జంతువుకు సంబంధించిన అన్ని వివరాలు ఓ డివైస్‌లో డిస్ప్లే అవుతాయి.
ఈ– టికెటింగ్‌తో క్యూలైన్లకు చెక్
గతంలో ఎంట్రీ టికెట్ల కోసం జూపార్క్ టికెటింగ్కౌంటర్ల వద్ద సందర్శకులు బారులుతీరేవారు. కౌంటర్ల వద్ద రద్దీకి చెక్ పెట్టేందుకు జూపార్క్ అధికారులు ఈ-–టికెటింగ్ వ్యవస్థను తీసుకొచ్చారు. జూపార్క్ వెబ్సైట్ తో పాటు హైదరాబాద్ జూ యాప్ ద్వారా ఆన్లైన్లో ఎంట్రీ టికెట్లు విక్రయిన్నారు. ఇండివిజువల్‌గా 30 టికెట్లు, ఇనిస్టిట్యూషన్లకు అపరిమిత టికెట్లు జారీ చేస్తున్నారు. అలాగే జూపార్క్ టికెటింగ్కౌంటర్ల వద్ద క్యూఆర్ కోడ్ పేమెంట్ అమలు చేస్తున్నారు. ఆన్లైన్పేమెంట్పై సందర్శకులకు అవగాహన కల్పించేందుకు ప్రతివారం ములుగు ఫారెస్ట్ కాలేజీ స్టూడెంట్లు(జూ కాప్స్) వస్తున్నారు.
100 సోలార్ సీసీ కెమెరాలు
జూపార్కులో మొత్తం 300 సీసీ కెమెరాలున్నాయి. వీటిలో 200 నార్మల్వి కాగా,100 సోలార్ సీసీ కెమెరాలు. కరెంట్ సప్లయ్‌తో సంబంధం లేకుండా సోలార్ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా జూ కమాండ్ కంట్రోల్ రూమ్‌నుంచి జంతువుల కదలికలను సిబ్బంది మానిటర్ చేస్తున్నారు. అలాగే మోషన్ క్యాప్చర్ కెమెరాలు, థర్మల్ డ్రోన్స్ ద్వారా జంతువులు, సందర్శకుల కదలికలను గుర్తిస్తున్నారు.
సైన్ బోర్డులపై క్యూఆర్ కోడ్
గతంలో యానిమల్స్ ఎన్క్లోజర్వ వద్ద జంతువుల గురించి తెలిపేలా సైన్ బోర్డులుండేవి. ప్రస్తుతం సైన్ బోర్డులపై క్యూఆర్ కోడ్అందుబాటు లో ఉంది. సందర్శకులు తమ ఫోన్లలో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే జంతువుల పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. జంతువులతోపాటు జూపార్కులోని చెట్లకు క్యూఆర్‌కోడ్‌లు ఏర్పాటు చేశారు.
త్వరలో మిర్రర్ బారియర్ ఎన్క్లోజర్లు
టెక్నాలజీని అందిపుచ్చుకుని జూపార్కులో సౌకర్యాలు పెంచుతున్నాం. ఇప్పటికే అమలులో ఉన్న ఈ– టికెటింగ్ ద్వారా జూపార్క్ టికెటింగ్కౌంటర్ల వద్ద రద్దీ తగ్గింది. ఎక్కువ మంది ఆన్లైన్లోనే ఎంట్రీ టికెట్లు బుక్చేసుకుంటున్నారు. త్వరలో జూ పార్కింగ్ఏరియాలో ఫాస్టాగ్ సిస్టమ్అమలుచేయబోతున్నాం. సందర్శకులు పార్కింగ్ ఫీజు చెల్లించడం మరింత ఈజీ అవుతుంది. జూపీడియా యాప్‌ను డెవలప్చేస్తున్నాం. అది అందుబాటులోకి వస్తే సందర్శకులకు ఎంతో ఉపయోగపడుతుంది. మిర్రర్ బారియర్ఎన్క్లోజర్లు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం.
సునీల్ హిరేమత్, క్యూరేటర్, జూపార్క్