తపాస్​పల్లి రిజర్వాయర్ లోకి గోదావరి జలాలు

తపాస్​పల్లి రిజర్వాయర్ లోకి గోదావరి జలాలు

కొమురవెల్లి మండలంలోని తపాస్​పల్లి రిజర్వాయర్ లోకి మంగళవారం అధికారులు గోదావరి జలాలను విడుదల చేశారు. దీంతో కొమురవెల్లి, చేర్యాల మండలంతో పాటు చుట్టు పక్కల వివిధ మండలాలకు చెందిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సిద్దిపేట వైపునకు తపాస్​పల్లి రిజర్వాయర్​నీటిని తరలించడాన్ని ఈ ప్రాంత ప్రజలు వ్యతిరేకించారు. ఇప్పటికైనా ఈ రిజర్వాయర్ కెపాసిటి పెంచి అందరికీ సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు. 

- కొమురవెల్లి, వెలుగు