శంషాబాద్ విమానాశ్ర‌యంలో రూ.12.22 ల‌క్ష‌ల విలువైన బంగారం ప‌ట్టివేత‌

శంషాబాద్ విమానాశ్ర‌యంలో రూ.12.22 ల‌క్ష‌ల విలువైన బంగారం ప‌ట్టివేత‌

హైదరాబాద్‌: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ప్ర‌యాణికుల త‌నిఖీల్లో భాగంగా క‌స్ట‌మ్స్ అధికారులు రియాద్ నుంచి వ్య‌క్తి వ‌ద్ద బంగారాన్ని గుర్తించారు. 233.06 గ్రాముల బ‌రువున్న రెండు గోల్డ్ బార్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. రూ.12.22లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పక్కా సమాచారంతోనే… సౌదీ అరేబియా నుండి వచ్చిన ప్యాసింజర్లను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అక్రమంగా తరలిస్తున్న బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ అధికారులు చెప్పారు. జీన్స్‌కు ప్ర‌త్యేకంగా డిజైన్ చేయించుకున్న ప్యాకెట్ల‌లో బంగారాన్ని ఉంచి అక్ర‌మంగా తీసుకువ‌చ్చాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు చేపట్టారు.