
గండిపేట, వెలుగు: నార్సింగి మున్సిపాలిటీ మంచిరేవులలో ఫోర్జరీ డాక్యుమెంట్తో రన్చేస్తున్న ఆరోన్ హాస్పిటల్ను అధికారులు శనివారం సీజ్చేశారు. రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఆరోన్ యాజమాన్యం ఆసుపత్రి పర్మిషన్ రెన్యువల్ కోసం సమర్పించిన డాక్యుమెంట్లలో రెంటల్ డీడ్ ఫోర్జరీ అని తేలిందన్నారు. దీంతో ఈ నెల 19 వరకు ఆసుపత్రి అనుమతులను రద్దు చేసినట్లు తెలిపారు. తిరిగి పొందేవరకు మూసి ఉంచాలని నోటీసులు ఇచ్చినా.. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో సీజ్ చేశామన్నారు. చేయడం జరిగిందన్నారు.