తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం బయ్యాక్కపేటలోని సారలమ్మ గుత్తి కోయ గూడెంలో అధికారులు బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. బుధవారం డీసీపీయూ, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది గుత్తి కోయగూడానికి చేరుకొని, గుంపు పెద్దమనిషి దేవయ్యతో మాట్లాడి బాల్య వివాహానికి సంబంధించిన వివరాలు సేకరించి, పెళ్లి ఆపారు.
అక్కడ ఉన్నవారికి చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ విక్రమ్, కౌన్సిలర్ రజని బాల్య వివాహ నిరోధక చట్టం గురించి వివరించి, అవగాహన కల్పించారు. వివాహం జరగబోయే బాలికను రెస్క్యూ చేశారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ములుగు బాలసదనానికి బాలికను తరలించారు. కార్యక్రమంలో ఈఎల్సీపీవో సంజీవ, సోషల్ వర్కర్ జ్యోతి, స్థానిక ఆర్ఐ, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.