పాల్వంచ,వెలుగు: పాల్వంచలో ఆరు దశాబ్దాల కిందట నిర్మించిన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్) కూలింగ్ టవర్లను బుధవారం అధికారులు కూల్చేయనున్నారు. ముంబైకి చెందిన ఎక్స్ క్యూబ్ కంపెనీతో ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆనంద్ శర్మ నేతృత్వంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ పనులు జరుగనున్నాయి.
కాలం చెల్లినవి కావడంతో కేటీపీఎస్ పాత ప్లాంట్ మూసివేత అనంతరం ముంబైకి చెందిన సంస్థ 450 కోట్లకు స్క్రాప్ ను టెండ ర్ల ద్వారా దక్కించుకుంది. సంవత్సర కాలంగా కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. స్క్రాప్ ను తరలించిన సంస్థ మిగిలిన ఈ కూలింగ్ టవర్ల నుంచి వచ్చే స్క్రాప్ ను కూడా తరలించేందుకు కలెక్టర్ అనుమతి తీసుకుంది.