మంత్రి తుమ్మల క్యాంప్ ఆఫీసులో ఆటో డ్రైవర్ ఆత్మహత్యయత్నం

ఖమ్మం : మంత్రి తుమ్మల క్యాంప్ ఆఫీసులో సైదులు అనే ఓ ఆటో డ్రైవర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు . బీఆర్ఎస్ పార్టీ ఆటో యూనియన్ నాయకుడు పాల్వంచ కృష్ణ ఈ రోజు కాంగ్రెస్ లో చేరుతుండగా అతనికి వ్యతిరేకంగా నిరసనకు దిగాడు.  కృష్ణ బీఆర్ఎస్ లో ఉన్న సమయంలో కాంగ్రెస్ ఆటో యూనియన్ సభ్యులను అనేక రకాల కేసులు పెట్టి వేధించాడంటూ సైదులు  ఆరోపించారు. కృష్ణ కాంగ్రెస్ లో చేరితే ఆటో డ్రైవర్లు అనేక మంది మళ్లీ ఆత్మహత్య చేసుకుంటారని సైదులు ఆత్మహత్యయత్నానికి దిగాడు.  స్థానికంగా ఈ ఘటన జరగడంతో  పాల్వంచ కృష్ణ కాంగ్రెస్ లో చేరకుండా వెనుతిరిగాడు.