కరోనాపై ఆటో డ్రైవర్ అద్భుతమైన మెసేజ్

బెంగళూరు: దేశంలో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 1.94 లక్షలకు పైగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో వైరస్ బారిన పడకుండా జాగ్రత్త వహించాలని కోరుతూ ఓ ఆటో డ్రైవర్ ఇచ్చిన మెసేజ్ అందర్నీ ఆకర్షిస్తోంది. బెంగళూరులో ఒక ఆటోపై రాసిన కొటేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ కొటేషన్ లో ఏంటంటే.. ‘మీరు కరోనా వైరస్ కు మరొక ప్రాణం  మాత్రమే. ప్రభుత్వ డేటాకు కేవలం నంబర్ మాత్రమే. కానీ మీరు మీ కుటుంబానికి విలువైన వారు, అమూల్యరత్నం లాంటి వారు. మీ ఆరోగ్యానికి మీరే జవాబుదారీ’. ఈ మెసేజ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఎవరి ఆరోగ్యాన్ని వాళ్లే కాపాడుకోవాలని.. ఆ బాధ్యత వారిదేనంటూ ఆటోవాలా ఇచ్చిన మెసేజ్ ను నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

సారీ సైనా.. కావాలని కామెంట్ చేయలే

కాళ్లపై బురద పడిందని.. తుడుపించుకున్న లేడీ పోలీస్

మెడికల్ ఆక్సిజన్ నిల్వలు పెంచుకోవాలె