అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య

అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
  • క్వారీ గుంతలో దూకి యువకుడు..


గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలిలో రెండు రోజుల కిందట కనిపించకుండపోయిన యువకుడి మృతదేహం క్వారీ గుంతలో లభ్యమైంది. క్వారీ గుంతలో దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గచ్చిబౌలి పీఎస్​ పరిధిలోని మజీద్ బండలో నివాసం ఉంటున్న కన్నేటి దుర్గాప్రసాద్(21)  ప్రైవేటు ఉద్యోగి. డ్యూటీ సక్రమంగా చేయడం లేదని కొన్ని రోజుల క్రితం ఉద్యోగం నుంచి తొలగించారు. 

దీంతో అతని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన దుర్గాప్రసాద్ ఈ నెల 7న  క్వారీ గుంతలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.  మరోచోట అప్పుల బాధ తాళలేక ఆటో డ్రైవర్ ఉరేసుకున్నాడు. గచ్చిబౌలి పరిధిలోని గోపన్ పల్లి ఎన్టీఆర్ నగర్​చెందినకు ఆటో డ్రైవర్​ పత్తావత్ శ్రీను(24)కు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. జల్సాల కోసం శ్రీను  భారీగా అప్పులు చేశాడు. డబ్బులు తిరిగిచ్చేయాలని అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో ఆదివారం  ఇంట్లో ఫ్యాన్​కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

టేకు చెట్టుకు ఉరేసుకుని మరొకరు..

ఇబ్రహీంపట్నం: నాదర్​గుల్​సమీపంలోనూ ఓ గుర్తు తెలియని యువకుడు చెట్టుకు టేకు ఉరేసుకొని అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. నిర్మానుష్య ప్రదేశంలో యువకుడి డెబ్​బాడీని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.