హన్మకొండలో పట్టపగలే ఆటో డ్రైవర్ హత్య

హన్మకొండలో పట్టపగలే ఆటో డ్రైవర్ హత్య

హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. అదాలత్ జంక్షన్ సమీపంలోపట్టపగలే  నడిరోడ్డుపైన ఆటో డ్రైవర్ ను హత్య చేశారు దుండగులు. ఈ హత్యతో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కి పడ్డారు. ఘటనా స్థలంలో   రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

 ఘటనా స్థలానికి వచ్చిన సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.   మృతుడు మడికొండకు చెందిన మాచర్ల రాజ్ కుమార్ గా గుర్తించారు.  ఆటో డ్రైవర్ ను ఎవరు ఎందుకు చంపారు ,పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణం దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు