- లింగంపల్లి నుంచి ట్రిపుల్ఐటీకి అర్ధరాత్రి ఆటో ఎక్కిన బాధితురాలు
- మజీద్‌బండలో ఆటోడ్రైవర్అఘాయిత్యం
- దాడి చేయడంతో మొఖంపై గాయాలు
- నిందితుడు- బోరబండకు చెందిన వ్యక్తిగా గుర్తింపు
- అదుపులోకి తీసుకున్న పోలీసులు
గచ్చిబౌలి, వెలుగు :చెన్నై నుంచి నగరానికి వచ్చి జాబ్చేసుకుంటున్న ఓ యువతిపై ఆటోడ్రైవర్ ఆటోలో లైంగికదాడి చేశాడు. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ లిమిట్స్‌లో ఈ ఘటన జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం..చెన్నైకి చెందిన యువతి(29) నగరంలో నానాక్‌రాంగూడలోని ఓ ఆర్కిటెక్ట్ఆఫీస్లో జాబ్చేస్తోంది. సోమవారం మధ్యాహ్నం చెన్నై నుంచి బస్సులో బయలుదేరి లింగంపల్లి చౌరస్తాకు అర్ధరాత్రి 1.30 గంటలకు వచ్చింది.
అక్కడి నుంచి నానక్‌రాంగూడ వెళ్లేందుకు అక్కడే ఉన్న ఆటో డ్రైవర్‌ను అడిగింది. లింగంపల్లి నుంచి నానక్‌రాంగూడ వెళ్లేందుకు డైరెక్ట్ ఆటోలు ఉండవని, మిమ్మల్ని సేఫ్ గా ట్రిపుల్ఐటీ చౌరస్తా వద్ద దింపుతానని, అక్కడి నుంచి మరో ఆటోలో వెళ్లాలని చెప్పి ఎక్కించుకున్నాడు. అర్ధరాత్రి 2 గంటలకు మజీద్‌బండ చౌర స్తా దాటిన తర్వాత మెయిన్‌రోడ్డు పక్కనే ఉన్న జీహెచ్ఎంసీ ఫుడ్స్టాల్వద్ద రోడ్డు పక్కనే ఉన్న చెట్ల మధ్యలోకి పోనిచ్చాడు.
నిర్మానుష్య ప్రదేశంలో ఆటోలోనే డ్రైవర్అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన యువతిని తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె మొఖంపై గాయాలయ్యాయి. బిగ్గరగా కేకలు వేయడంతో ఆ రూట్లో వెళ్తున్న జొమాటో డెలివరీ బాయ్, మరో బైక్రైడర్గమనించి ఆగారు. వీరిని చూసిన డ్రైవర్యువతి పర్సులో నుంచి రూ.2వేలు తీసుకొని కిందకు తోసేసి ఆటోతో సహా పరారయ్యాడు. వెంటనే జోమాటో డెలివరీ బాయ్డయల్100కు కాల్ చేయగా, పోలీసులు వచ్చారు.
బాధిత యువతి గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఆటోడ్రైవర్తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎస్ఓటీ, సీసీఎస్, గచ్చిబౌలి పోలీసులు కలిసి మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. ఆటోకు ముందు, వెనుక నెంబర్ప్లేట్లేకపోవడంతో ట్రేస్‌చేయడం కష్టతరంగా మారింది. సీసీ కెమెరాలను పరిశీలిస్తే యువతి లింగంపల్లి చౌరస్తాలో ఆటో ఎక్కినట్లు గుర్తించారు.
యువతిని వైద్య పరీక్షల కోసం కొండాపూర్‌లోని జిల్లా దవాఖానకు తరలించారు. అయితే, అక్కడ వైద్య పరీక్షలకు బాధిత యువతి సహకరించడం లేదని, దగ్గరకు వచ్చేవారిపై కేకలు వేసిందని తెలిసింది. ఏదైనా సమస్య ఉందేమోనని గాంధీ దవాఖానలో న్యూరో డాక్టర్లకు చూపించడానికి తీసుకువెళ్లారు. అయితే, అత్యాచారం ఘటనపై వివరాలు వెల్లడించేందుకు గచ్చిబౌలి పోలీసులు నిరాకరిస్తున్నారు.
ఘటనపై అనుమానాలు
బాధిత యువతి పూర్తి వివరాల కోసం పోలీసులకు తన తల్లిదండ్రుల ఫోన్‌నంబర్లు ఇచ్చింది. పోలీసులు ఆ నెంబర్లకు కాల్చేస్తే పనిచేయడం లేదని తెలిసింది. యువతి పనిచేస్తున్న ఆఫీసుకు వివరాలు సేకరించేందుకు వెళ్లగా తమ దగ్గర ఆ యువతి పని చేయడం లేదని మేనేజ్మెంట్చెప్పింది. దీంతో పోలీసులు ఘటన జరిగిందా లేదా అన్నది తేల్చడానికి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని ప్రకటించారు.