
నారాయణపేట, వెలుగు: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తూ నారాయణపేట జిల్లా జడ్జి తీర్పు ఇచ్చారు. ఎస్పీ యోగేశ్ గౌతమ్ తెలిపిన ప్రకారం.. దామరగిద్ద మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్బండగొండ నరేశ్(26), స్థానికంగా బాలికను ప్రేమ పేరుతో వేధిస్తుండగా ఆమె కుటుంబసభ్యులు హెచ్చరించినా మానుకోలేదు.
3ఆపై 2021 మార్చిలో ఆమెను నరేశ్ ముంబైకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తండ్రి నారాయణపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. కోర్టులో విచారణలో భాగంగా నరేశ్ కు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చినట్టు ఎస్పీ చెప్పారు.