నో రూల్స్.. అంతా నా ఇష్టం అన్నట్టుగా మారిపోయింది నిజామాబాద్ నగరంలోని ఆటోవాలాల తీరు. ఆర్టీఏ రూల్స్, ట్రాఫిక్ రూల్స్ వీరికి ఏ మాత్రం పట్టవు. వారికి నచ్చిన రీతిలో నచ్చిన మార్గంలో ఎక్కడపడితే అక్కడ ఆటో పార్కింగ్ చేస్తారు. కొన్ని ఆటోలకు నంబర్ ప్లేట్లు ఉండవు, అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. ఆర్టీవో నిబంధనలు నలుగురికి మించి ఆటోలో ఎక్కించుకోకూడదు. అయినా డ్రైవర్ తన పక్కనే చిన్నా పిల్లలు, వృద్ధులను సైతం కూర్చోబెట్టుకొని వెళ్తుంటారు. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా రాంగ్ రూట్లో వెళ్లడమేకాకుండా ఎదురుగా వచ్చిన వారిని దబాయిస్తారు.
పోలీసులు కూడా వీరిని పట్టించుకోవడంలేదు, రాంగ్ రూట్లో వెళ్లినా చూసి చూడనట్టు వదిలేస్తుండటంతో ఆటోవాలాలు మరింత రెచ్చిపోతున్నారు. వీరి వ్యవహార శైలితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి ఆటోల పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, నిబంధనలను ఉల్లంఘించిన ఆటోవాలాలపై చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.
వెలుగు ఫోటోగ్రాఫర్, నిజామాబాద్