యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరి కొండపైకి ఆటోల రాకపోకలను అనుమతించాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు.సోమవారం ఈవో రామకృష్ణారావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 2022 మార్చి 28 నుంచి కొండపైకి ఆటోలను నిషేధించడంతో 300 ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.కనీసం ప్రత్యామ్నాయం కూడా చూపలేదని మండిపడ్డారు.
ఆటోల రాకపోకలు పునరుద్ధరించాలని20 నెలల పాటు రిలే నిరాహార దీక్షలు చేసినా పట్టించుకోలేదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కొండపైకి ఆటోలను అనుమతించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఆటో డ్రైవర్లు గుండు నరసింహ గౌడ్, దేవేందర్, మొగులయ్య, మన్సూర్ పాషా, బాలరాజు, సత్తయ్య, సంతోష్ పాల్గొన్నారు.