హైదరాబాద్: ఇతర జిల్లాలకు చెందిన ఆటోలను కూడా హైదరాబాద్ లో తిరిగేందుకు అనుమతి ఇవ్వాలని నిరసన వ్యక్తం చేశారు ఆటో డ్రైవర్లు. ఖైరతాబాద్ లోని ప్రధాన ఆర్టీఏ కార్యాలయం వద్ద 200 మందికి పైగా ఆటో డ్రైవర్లు ధర్నా చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఆటో డ్రైవర్లు.. ఆర్టీఏ అధికారులు, పోలీసుల వేధింపులతో పూట గడవని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోవాలా ధర్నాతో పంజాగుట్ట, ఖైరతాబాద్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయ్యింది. జాతీయ ఆదివాసి నాయకుడు కిషన్ నాయక్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టిన ఆటో డ్రైవర్లు.. అనంతరం ఆర్టీవో రామచంద్రయ్యకు వినతిపత్రం అందించారు. ఆటో డ్రైవర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీఏ అధికారులు 15 రోజులపాటు హైదరాబాద్ లోకి అనుమతి ఇవ్వడంతో నిరసనను విరమించారు. ఇక నుంచి హైదరాబాద్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఆటోలు మాత్రమే సిటీలో నడపాలనే రూల్ ను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని కోరారు ఆటో డ్రైవర్లు.
మరిన్ని వార్తల కోసం: