ఖానాపూర్​లో ఆటో డ్రైవర్ల ర్యాలీ

ఖానాపూర్, వెలుగు: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కల్పించిన ఉచిత ప్రయాణ సౌకర్యంతో తాము వీధిన పడ్డామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శనివారం ఖానాపూర్​లోని ఎంపీపీ కార్యాలయం నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే ఈ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.