ఫైనాన్స్ వేధింపులతో ఆటోడ్రైవర్ సూసైడ్

 ఫైనాన్స్ వేధింపులతో ఆటోడ్రైవర్ సూసైడ్
  • మెదక్ జిల్లా శివ్వంపేటలో ఘటన

శివ్వంపేట, వెలుగు: ఫైనాన్స్ వేధింపులతో ఆటోడ్రైవర్ సూసైడ్ బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం..  శివ్వంపేట మండల కేంద్రానికి చెందిన పెద్ద కోళ్ల సంజీవ్(30), శ్రీకన్య దంపతులు. కాగా.. ఎనిమిది నెలల కింద సంజీవ్ ఫైనాన్స్​లో ప్యాసింజర్​ఆటో తీసుకొని నడుపుతున్నాడు. 

ఆర్థిక ఇబ్బందులతో ఈఎంఐలు కట్టలేకపోతున్నాడు. ఫైనాన్స్​సంస్థ ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక మనస్తాపంతో అతడు ఆదివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడి భార్య శ్రీకన్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.