మెట్ పల్లి లో ఆటో డ్రైవర్ల ఆందోళనలు

ముస్తాబాద్ / మెట్ పల్లి / ఎల్లారెడ్డిపేట, వెలుగు: మహిళలకు ఫ్రీ జర్నీ అమలు చేయడంతో ఆటోల్లో ప్యాసింజర్లు ఎక్కడం లేదని దీంతో తమకు నష్టం జరుగుతోందని ఆటో డ్రైవర్లు  బుధవారం ఆందోళన చేశారు.  మెట్​పల్లిలో అంబేద్కర్​ స్టేడియం , బస్ డిపో నుంచి వందల మంది ఆటో డ్రైవర్లు ర్యాలీగా వచ్చి, పాత బస్టాండ్ వద్ద  ఆందోళన చేశారు.  అనంతరం సబ్ కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లి డీఏఓ కు   వినతిపత్రం అందించారు.  ప్యాసింజర్ ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయంగా బిజినెస్ లు లేవని, ఉపాధి కోసం ఆటో డ్రైవర్ వృత్తిని ఎంచుకున్నామన్నారు.  

ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. ఎల్లారెడ్డిపేటలో  ఆటో యూనియన్ డ్రైవర్లు సుమారు 500 ఆటోలతో కామారెడ్డి,సిరిసిల్ల  మెయిన్​  రోడ్డుపై  రాస్తారోకో చేశారు.  రోజూ  ఆటోలకు గిరాకీ ఉంటేనే తమ ఇండ్లు గడుస్తాయని, లేకుంటే కుటుంబాలతో కలిసి ఉరి పెట్టుకోవాల్సిందే అని    ఆవేదన  చెందారు. 40 నిమిషాలు ఉద్రిక్తత చోటు చేసుకోగా పోలీసులు చేరుకొని ధర్నాను విరమింప జేశారు. ఈధర్నాలో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ పొన్నం శ్రీనివాస్ గౌడ్, కట్టెల బాలయ్య, జెల్ల రవి, మస్కూరి లక్ష్మణ్, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.