కామారెడ్డి టౌన్, వెలుగు: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోతున్నామని, తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు.
కొత్త బస్టాండ్చర్చి గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ మెయిన్‌రోడ్, రైల్వే కమాన్, స్టేషన్‌రోడ్, నిజాంసాగర్‌చౌరస్తా మీదుగా వెలమ ఫంక్షన్హాల్వరకు సాగింది. ఇక్కడ డ్రైవర్లు సమావేశం నిర్వహించారు. ఆటో డ్రైవర్లకు ప్రతినెలా రూ.15 వేల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.