జూలూరుపాడు, వెలుగు : మండల కేంద్రంలో ఏఐటీయూసీ, టీఏడీయూ, యూనియన్ల ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా డ్రైవర్లు ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కేక్‌కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఆటో కార్మికులు అనేక సమస్యలతో జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు.
ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ.12 వేలు అందిస్తామన్న హామీని వెంటే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.